Take a fresh look at your lifestyle.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజి ఒట్టి డొల్ల

  • నగదు ఇవ్వాలని కోరితే…రాష్ట్రాలను బిచ్చగాళ్లలా చూసింది
  • కేంద్రం చెప్పినట్లు చేస్తేనే నిధులిస్తారా ?
  • ప్యాకేజీ పేరుతో తన పరువు తానే తీసుకుంది
  • కేంద్రానిది ప్యూడల్‌ ‌వైఖరి…పూర్తిగా ఖండిస్తు
  • కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ ‌ఫైర్‌

దేశంలో కొరోనా విపత్తుతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల…వందకు వంద శాతం బోగస్‌. ‌కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది.రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే…రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా చూసిందని సీఎం కేసీఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ పేరుతో తన పరువు తానే తీసుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌పొడిగింపు, కేంద్ర మార్గదర్శకాల మేరకు సడలింపులు, రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహణ నిర్వహణ తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రాలపై కేంద్రం ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గం అని నిప్పులు చెరిగారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలపై కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరి ఏ మాత్రం సరైంది కాదన్నారు.

మెడ మీద కత్తిపెట్టి ఇది చెయ్యి…అది చెయ్యి అని చెప్పడం ప్యాకేజీనా ఆ నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే అవి మాకు అక్కరలేదని స్పష్టం చేశారు. ఇదేనా ఫెడరల్‌ ‌స్పూర్తి అని ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్లు చేస్తేనే నిధులిస్తారా అని నిలదీశారు. దేశంలో కొరోనా విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని తప్పుపడుతూ ఇది అంకెల గారడీ మాత్రమే అని జపాన్‌లోని అంతర్జాతీయ పత్రికలు సైతం కథనాలు ప్రచురించాయన్నారు. కేంద్ర ప్రకటించిన విధంగా రాష్ట్రాలకు పెంచిన ఎప్‌ఆర్‌బిఎం పరిమితి ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రూ. 20 వేల కోట్లు మాత్రమే వస్తాయన్నారు. ఇందులో రూ. 5 వేల కోట్లు రాష్ట్రానికి ఎలాగూ రావాల్సివేనన్నారు. ఇక కేంద్రం కొత్తగా తీసుకు రానున్న విద్యుత్‌ ‌సంస్కరణలను ఒప్పుకుంటే రూ. 2.5 వేల కోట్లు ఇస్తామన్నారనీ, పట్టణాలు, మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను, ఇతర పన్నులను పెంచి ప్రజలపై భారం వేస్తే మరో రూ. 2.5 వేల కోట్ల నిధులు ఇస్తామన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్యూడల్‌ ‌వైఖరిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామనీ, కేంద్రం ప్రకటించిన నిజమైన ప్యాకేజీ ఎంటో బోగస్‌ ‌ప్యాకేజీ ఏమిటో ప్రజలే తేలుస్తారనీ, త్వరలోనే ప్రజలకు అర్థమవుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటాం
కాగా, పోతిరెడ్డిపాడు అంశంపై సైతం ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజలకు గోదావరి జలాలను వాడుకోవచ్చని గతంలో తాను అన్నమాటలు వాస్తవమేననీ, అయితే, సముద్రంలోకి వృధాలోకి పోతున్న నీటిని వినియోగించుకోవచ్చని మాత్రమే తాను అన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణా జలాలను వాడుకుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా నదీ •లాల విషయంలో రాజీ పడేది లేదనీ, పోతిరెడ్డిపాడుపై గతంలో ఉద్యమించింది ఎవరో అందరికీ తెలుసనీ, ప్రతిపక్షాలు ఈ అంశంపై చేస్తున్న విమర్శలు అర్ధరహితమని స్పష్టం చేశారు. చట్టం పరిధిలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామనీ, అయితే, వివాదాలకు పోవడం లేదని తేల్చి చెప్పారు. నికర జలాలే కాకుండా మరో 650 టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply