Take a fresh look at your lifestyle.

కరోనా కట్టడిలో సీఎం కేసిఆర్‌ ‌విఫలం

  • రోనా నియంత్రణ కోసం ప్రభుత్వమే తక్షణ వైద్య సదుపాయాలు కల్పించాలి
  •  మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  
  • విలేకరుల సమావేశంలో  సిఎల్పీనేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క 

మధిర, జూలై 7 (ప్రజాతంత్ర) : కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనా భయంతో ఆందోళనకు గురవుతున్నారని సిఎల్పీనేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమా ర్క అన్నారు. మంగళవారం స్థానిక భట్టి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో సిఎం కేసిఆర్‌ ‌ఘోరంగా విఫలమ య్యారన్నారు. ప్రజలంతా కరోనాతో ఇబ్బందు ల్లో ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు ఆగమే ఘాల మీద సచివాలయాన్ని కూల్చి నూతన సచివాలయాన్ని ఏర్పాటు చేయటం వెనుక అంతార్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కరో నా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులుపడుతుంటే కేసిఆర్‌ ‌గత కొన్ని రోజులుగా కనబడటం లేదని, బయటకొచ్చి వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.

కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ ‌పేరుతో రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, సుమారు 3లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను నెట్టివేశారన్నారు. అసెంబ్లీలో మీరు చెప్పిన విధంగా మీరు, మీ ఎమ్మెల్యేలు మాస్కులు లేకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవచేయాలని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చటంలో సిఎంకేసిఆర్‌ ‌పూర్తిగా విఫలం చెందారని, నిరుద్యోగ భృతి, దళితులకు 3ఎకరాలు భూమి, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇం‌డ్లు తదితర హామీలను విస్మరించి హామీలన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. చేతులు జోడించి రాష్ట్ర ప్రజల తరుపున విన్నవించుకుంటున్నాను కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని సిఎల్పీ నేత భట్టి కోరారు.

Leave a Reply