- కలెక్టర్ వ్యవస్థ బలోపేతానికే అదనపు కలెక్టర్లు
- ప్రతీ జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనం
- పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
- 20 రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చాలి
- అభివృద్ధి జరగని పక్షంలో కఠినచర్యలు
అడిషనల్ కలెక్టర్ వ్యవస్థ ఆషామాజీ కాదు
కలెక్టర్‌ల వ్వవస్థను బలోపేతం చేసేందుకే అదనపు కలెక్టర్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పునురుద్ఘాటించారు. ఇదివరలో కలెక్టర్‌లు జిల్లాలో 112 రకాల కమిటీలకు చైర్మన్‌లుగా ఉండేవారని వాటిని కుదించి 26 కమిటీలకు బాధ్యులను చేశామని, మిగతా బాధ్యతలన్నింటినీ అదనపు కలెక్టర్లకు విభజించామని పేర్కొన్నారు.పచ్చదనం, పనిశుభ్రతలకు కలెక్టర్‌లకు ఎంత బాధ్యత ఉంటుందో, అంతే బాధ్యత అదనపు కలెక్టర్‌లకు ఉంఉటందని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ వ్యవస్థను ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం హెచ్చరించారు. స్థానిక సంస్థలకు ఉండే హక్కులను, చట్టాలను, • ప్రజాప్రతినిధుల హక్కులు ప్రాధాన్యాలను లోకల్‌బాడీలకోసం నియుక్తులైన అడిషనల్ కలెక్టర్‌లు బాధ్యతవహించాలని చెప్పారు. రెవెన్యూ, రిజి•స్టేష్రన్స్, ప్రోటోకాల్ అవసరాలకోసం నియుక్తులైన అడిషనల్ కలెక్టర్‌లు అడ్మినిస్ట్రేషన్ వ్యవహరాలను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతీ 500 జనాభాగల గ్రామపంచాయతీకి రూ.10లక్షల వరకు ఏటా నిధులు ఇస్తున్నందున రోడ్ల విస్తరణ, గ్రామపారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, పాఠశాలల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి ప్రతీపాఠశాల, అంగన్‌వాడీల నిర్వహణ, మొక్కల ల మొక్కల పెంపకం వంటి ప్రతీ అంశాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి నిరంతర అభివృద్ధికి అడిషనల్ కలెక్టర్‌లు చోదకులు కావాలని పిలుపు నిచ్చారు మంత్రులు ప్రతీ సందర్భంలో జిల్లాలు పర్యటిస్తుంటారని, ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్ వంటి జిల్లాలో పోడు భూముల సమస్యలు ఉన్నాయని, అక్కడి సమస్యలన్నింటిపైన ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలని ఆదేశించారు.ప్రతీ సమస్యకు స్థానిక పరిష్కారాలను ఇవ్వాలని ఆదేశించారు. మిషన్‌భగీరథ• ఇంతవరకు అందని ఆవాసాలనైన దృష్టిపెట్టాలని, చాలా చోట్ల సాంకేతిక సమస్యలతోనే పనులు పూర్తి కావడంలదేని, అయినప్పటికీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని, అలసత్వం ప్రదర్శించవద్దని, అలసత్వం ప్రదర్శించే వారిపైన అడిషనల్ కలెక్టర్‌లు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు.
పదిహేనురోజుల్లో పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించాలని ఆదేశించారు.ప్రతీ జిల్లాలో ఈ సమ్మేళనాలు జరగాలని సీఎం సూచించారు. ఆయా జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు, ఎంపీటీసీలు, జడ్పీటీసిలను సమ్మేళనానికి ఆహ్వానించాలని చెప్పారు ఇరవై రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారాలని హెచ్చరించారు.పంచాయతీరాజ్ సమ్మేళనంలో డిఎల్‌పీవోలు, డీపీవో, జడ్పీ సీఈవోలు ఈ సమ్మేళనానికి బాధ్యులుగా ఉండాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో అభివృద్ధి ప్రణాళికలు రచించాలని, గ్రామసభలు నిర్వహించాలని, గ్రామాల పారిశుద్ధ్యం , పరిశుభ్రత, మొక్కల పెంపకం, మంచినీటిసరఫరా, వంటి ప్రతీ అంశం పైన శ్రద్ద తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల పర్యవేక్షణకోసం నియమించిన అదనపు కలెక్టర్‌లు ఈ బాధ్యతలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనఖీలు ఉంటాయని, ఫ్లైయింగ్‌స్వ్కాడ్‌లు ప్రతీగ్రామాన్ని పర్యటిస్తారని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని సీఎంహెచ్చరించారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే అనేక రంగాల్లో నిరుపమాన అభివృదద్ధి సాధించామని కేంద్రం నుంచి సహాయ సహకారాలు లేకున్నా, కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లను నిర్మించుకొని కోటి ఎకరాలకు నీరందరించే దిశలో ముందువరుసలో నిలిచామని, నిరంతర విద్యుత్తు సరఫరాలో దేశానికే ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో 40వేల కోట్ల రూపాయలతో సంక్షేమం, అభివృద్ధి కార్యకమ్రాలు అమలవుతున్నాయని చెప్పారు.కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పెన్షన్లు, కంటివెలుగు వంటి కార్యక్రమాలు ప్రతీ పేద ఇంటి తలుపుతట్టాయని సీఎం ఉదహరించారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.