Take a fresh look at your lifestyle.

సమ్మె రైతులది.. సంబురాలు కెసిఆర్‌ ‌వి!

‘‘‌వాస్తవంగా ముఖ్యమంత్రి ధర్నా చౌక్‌ ‌లో ధర్నా చేసింది వానాకాలం చేతికొచ్చిన వరి పంట కొనాలని కాదు.తెలంగాణలో అసలు పంటే వేయని యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని. ఈ గమ్మత్తయిన ధర్నా కి దిల్లీ లో రైతులు చేస్తున్న ధర్నా కి లంకె పెట్టే తాపత్రయం లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు నవ్వుల పాలయ్యారు.వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గతంలో డిసెంబర్‌ 8‌న రైతు కార్యక్రమం భారత్‌ ‌బంద్‌ ‌లో తన మంత్రి వర్గంను టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పాల్గొనేటట్లు ఉసిగొల్పారు.తను మాత్రం పామ్‌ ‌హౌస్‌ ‌లో పడుకుని అధికారంలో ఉన్నామనే అధికార ధర్మాన్ని ఆనాడు కాపాడారు.తర్వాత మోడీ అమిత్‌ ‌షా ల బెదిరింపులకు భయపడ్డ కెసిఆర్‌ అప్పటినుండి మోడీ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే ప్రకటన తేదీ వరుకు దిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల ఊసెత్తలేదు’’

మోడి రైతు చట్టాలను వెనక్కు తీసుకోవటం తో ఎట్టకేలకు రైతుల పోరాటం ఫలించింది.ఇది ముమ్మాటికి రైతుల విజయం. అంతే కాదు మొదటి నుండి చివరి వరకు అడుగడుగునా అన్నదాతలకి అండగ ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం.కాంగ్రెస్‌ ‌తో పాటు కలిసి వచ్చిన మొత్తం 19 వామపక్ష,తెలుగుదేశం ఇతర ప్రతిపక్ష పార్టీల విజయం.అంతే గాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌విజయం కానే కాదు. దిల్లీ రైతుల పోరాటం లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రమేయం లేదు.రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన రైతులకి మద్దతుగా చట్టసభల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ గొంతెత్త లేదు.కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాలు మరియు పంజాబ్‌ ‌రాజస్థాన్‌ ‌ముఖ్య మంత్రులతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ ‌కమ్యూనిస్టు ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌డీఎంకే ప్రభుత్వం,పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఇతర ప్రతిపక్ష పాలక రాష్ట్రాలు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు ఉద్యమాలకి బాసటగా నిలిచినవి. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పోరాటాలను తేలిగ్గా తీసుకుండు.అసెంబ్లీ లో తీర్మానం ఆలోచన చెయ్యలేదు.

పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి చరణ్‌ ‌జిత్‌ ‌సన్ని రైతు పోరాటంలో పాల్గొని కేసుల పాలై, డిల్లీ ఎర్ర కోటపై జెండా ఎగరేసిన రైతులకి ఇప్పటికే 2 లక్షల రూపాయలు నజరాన ప్రకటించారు.చనిపోయిన రైతులకు రాష్ట్రంలో ఉన్న బీమా సౌర్యం ద్వారా ఆర్థిక సహాయం చేయటం జరిగింది.పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చనిపోయిన రైతులకి 5 లక్షలు చొప్పున అదనంగా ఆర్థిక సహాయం చేయటం జరిగింది.ఇక తెలంగాణలో ఇప్పటి కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు అప్పటి కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి గత ఫిబ్రవరి 7 న దిల్లీ రైతుల కి మద్దతిచ్చే విధంగా రాజీవ్‌ ‌రైతు భరోసాయాత్రను నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా అచ్చంపేట నుండి రావిర్యాల వరుకు సుమారు 120 కిమి మేర పాదయాత్ర చేయడం జరిగింది.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడంతో ఎన్నికల నియమావళి కారణంగా పాదయాత్రను రావిర్యాలలో ముగించారు. రావిర్యాలలో రాజీవ్‌ ‌రైతు రణభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్యహించారు. సుమారు మూడు వేల ట్రాక్టర్లతో ట్రాక్టర్‌ ‌నడుపుకుంటూ రైతు బిడ్డ రేవంత్‌ ‌రెడ్డి సభకు హాజరయ్యారు.ఇటీవల సెప్టెంబర్‌ 27‌న అఖిలభారత కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు మేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం, వామపక్ష,తెలంగాణ జన సమితి,సిపిఐ ఎంఎల్‌ ‌న్యూడెమొక్రసీ రెండు పార్టీలను,ఇంటి పార్టీలను సైతం కలుపుకుని రైతుల భారత్‌ ‌బంద్‌ ‌ను జయప్రదం చేశారు.రేవంత్‌ ‌రెడ్డి భారత్‌ ‌బంద్‌ ‌లో అందర్ని ఏకం చేసి ప్రతిపక్ష పార్టీల ఐక్యతను చాటారు.పోరాడి సాధించిన ఘనత ఆది నుంచి ఇప్పటివరకు రైతులకి అండగ ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీకి దక్కాలి.ఇంకా కాంగ్రెస్‌ ‌తో కలిసి వచ్చిన వామపక్ష ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకి ఈ ఘనత దక్కాలి.

రైతుల పోరాటాలకి లఖింపూర్‌ ‌ఖేరి ఘటనలో బాధిత రైతులకు అండగా ఉన్న రాహుల్‌, ‌ప్రియాంక గాంధీ కి ఘనత దక్కాలి.రాష్ట్రంలో రైతు ల కోసం పాదయాత్ర చేసి భారతీయ కిసాన్‌ ‌సంఘం జాతీయ అధికార ప్రతినిధి రాకేష్‌ ‌టికాయిత్‌ ‌ను తెలంగాణకి ఆహ్వానించిన ఘనత టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి కి దక్కాలి. కాని విచిత్రంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌భజన మండలి అందరి పోరాటల ఖ్యాతి ని కేసీఆర్‌ ‌ఖాతాలో జమ చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.ఇక పాల ప్యాకెట్‌ ‌గులాబీ బ్యాచ్‌ ‌లు కెసిఆర్‌ ‌చిత్రపటాలకి పోటీలు పడీ మరీ పాలాభిషేకాలు చేశారు.టీఆర్‌ఎస్‌ ‌మంత్రులు కొందరు కెసిఆర్‌ ఇం‌దిరా పార్కులో చేసిన ధర్నా వల్లే నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహిరించుకున్నాడని తెలిసి తెలియని అయోమయ అమాయకత్వం తో గప్పాల గొప్పలకి దిగారు.తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్డే ప్రయత్నం చేశారు.కెసిఆర్‌ ‌పట్ల తమ స్వామి భక్తి మంత్రులు చాటుకున్నారు.మంది దూడను తమ దొడ్లో కట్టేసి తమ దూడేనని తెలంగాణ సమాజాన్ని నమ్మించటాని అనేక తిప్పలు పడ్డారు. వాస్తవంగా ముఖ్యమంత్రి ధర్నా చౌక్‌ ‌లో ధర్నా చేసింది వానాకాలం చేతికొచ్చిన వరి పంట కొనాలని కాదు.

తెలంగాణలో అసలు పంటే వేయని యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని. ఈ గమ్మత్తయిన ధర్నా కి దిల్లీ లో రైతులు చేస్తున్న ధర్నా కి లంకె పెట్టే తాపత్రయం లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు నవ్వుల పాలయ్యారు.వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గతంలో డిసెంబర్‌ 8‌న రైతు కార్యక్రమం భారత్‌ ‌బంద్‌ ‌లో తన మంత్రి వర్గంను టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పాల్గొనేటట్లు ఉసిగొల్పారు.తను మాత్రం పామ్‌ ‌హౌస్‌ ‌లో పడుకుని అధికారంలో ఉన్నామనే అధికార ధర్మాన్ని ఆనాడు కాపాడారు.తర్వాత మోడీ అమిత్‌ ‌షా ల బెదిరింపులకు భయపడ్డ కెసిఆర్‌ అప్పటినుండి మోడీ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే ప్రకటన తేదీ వరుకు దిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల ఊసెత్తలేదు. 12 నెలలుగ రైతులు చలిలో వణుకుతూ,ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ సుమారు 650మంది చనిపోయారు.అన్నదాతల్ని బిజెపి నాయకులు దేశ ద్రోహులు అన్నా,గూండాలు అన్నా,ఉగ్రవాదులు అని కించ పరిచిన,బాష్పవాయు గోళాలు ప్రయోగించి అన్నదాతలు మూర్చపోయేట్లు చేసిన,జల ఫిరంగులతో తరిమినా,తలలు పగలగొట్టి రైతుల రక్తం ఏరులై పారించినా, కనీసం రైతుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌జాలి చూపలేదు.రైతు బిడ్డనని చెప్పుకునే కెసిఆర్‌ ‌కి రైతుల పై పెద్ద ఎత్తున హింస జరిగినా ఏమి ఎరగనట్లు వ్యవహరించారు. పోరాడకుండా రైతు ఉద్యమానికి పంగనామం పెట్టి తీరా రైతు పోరాటం ఫలించాక లిసమ్మె రైతులది సంబురాలు కెసిఆర్‌ ‌విలి అన్నట్లు ప్రెస్‌ ‌మీట్‌ ‌పెట్టారు. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి రైతు ఉద్యమాకారులకి ఇచ్చె దాని కన్నా ఒక లక్ష ఎక్కవ చెప్పి చనిపోయిన రైతు కుటుంబాలకి 3 లక్షల సాయం ప్రకటించి తన దైన శైలిని చాటుకున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్‌.ఉత్తరప్రదేశ్‌ ‌లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో బిజెపి నేత కేంద్ర మంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా కుమారుడు ఆశీష్‌ ‌మిశ్రా 5 గురు రైతుల్ని వాహనాలతో గుద్దించి తొక్కించి చంపినప్పుడు ఆనాడు స్పందించలేదు. రైతుల మరణాలకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్‌ ‌కుమార్‌ ‌మిశ్రాను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించమని తప్పదు అన్నట్లు డిమాండ్‌ ‌చేశారు.రైతు నల్ల చట్డాలకి వ్యతిరేకంగా పోరాడి అమరులైన రైతులకి 3 లక్షలు ప్రకటించటం కెసిఆర్‌ ‌ప్రచారం లో భాగమే తప్ప నమ్మశక్యం కాదు అనేది ప్రతిపక్షనేతల వాదన.

కాని తెలంగాణలో కూడా రోజు రోజు కు ఎందోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఇలాంటి తరుణంలో స్థానిక తెలంగాణ బిడ్డల్ని కాదని ఉత్తరప్రదేశ్‌ ‌పంజాబు రైతులకి సహాయం చేస్తాననే ముఖ్యమంత్రి ప్రకటన పట్ల తెలంగాణ ఉద్యమకారులు భగ్గుమంటున్నారు.కూట్లో రాయి తీయలేని కెసిఆర్‌ ఏట్లో రాయి తీస్తడా అని ఉద్యమకారులు వెటకారం చేస్తున్నారు.ఇప్పటి వరకు కెసిఆర్‌ ఏడేళ్ళ పాలనలో సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.ఆత్మహత్య చేసుకున్న రైతులందరికి 6 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించలేదు.కేవలం1600ల మందిని మాత్రమే గుర్తించి మిగతా రైతుల ఆత్మహత్య లను పరిగణలోకి తీసుకోలేదు.1600 మందిలో కొద్దిమందికి మాత్రమే 6 లక్షలు సహాయం చేసి మిగత 350 మంది రైతులకి సాయం ఇప్పటి వరుకు అందించలేదు.ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల అందరిని గుర్తించి,అదే విధంగా ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న సుమారు 300మంది నిరుద్యోగులను గుర్తించి అందరిని ఆదుకోవాల్సిన నైతిక బాద్యత ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పై ఉంది.అధికారంలో ఉన్నామనే విజ్ఞత మరిచి ప్రతిపక్షం లాగ ధర్నాలకి దిగితే శాశ్వతంగా ప్రతిపక్షం లో కూర్చోమని తథాస్తు దేవతలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌గారిని ఇప్పటికే దీవించి ఉంటారు…
– కోటూరి మానవతారాయ్‌, ‌టిపిసిసి అధికార ప్రతినిధి
( 9000919101)

Leave a Reply