Take a fresh look at your lifestyle.

సీఎల్పీ ధాటికి తోక‌ముడిచిన కేసీఆర్‌..

*28 వ‌ర‌కూ స‌భ అన్నారు..ఇలా ముగించారు
 *అప్పుల చ‌ట్టం కోస‌మే అసెంబ్లీ
 *బీసీల‌కు స‌బ్ ప్లాన్ క‌ల్పించాలి..: భట్టి విక్రమార్క  
కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్షం ధాటికి త‌ట్టుకోలేక స‌భ‌ను అర్థాంత‌రంగా వాయిదా వేసి సీఎం  కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పారిపోయార‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ‌విమర్శించారు.కాంగ్రెస్ నేతలు అడిగే ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ ద‌గ్గ‌ర స‌మాధానాలు లేకే స‌భ నుంచి ప‌రార‌య్యార‌ని  ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ నిరవ‌ధిక వాయిదా ప‌డ్డాక సీఎల్పీ నేత బ‌ట్టి, ఎమ్మెల్యేలు సీత‌క్క‌, దుద్ధిళ్ల శ్రీధ‌ర్ బాబు, జ‌గ్గారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు…. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ.. శాస‌న‌స‌భ‌లో  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించే ధైర్యంలేక టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పారిపోయింద‌న్నారు. ఆరునెల‌ల త‌రువాత స‌భా స‌మావేశాల సంద‌ర్భంగా జ‌రిగిన బీఏసీ సమీటింగ్ లో 28 వ‌ర‌కూ అసెంబ్లీ జ‌రుపుతాం అని చెప్పి, అవ‌స‌ర‌మైతే ప్ర‌తిప‌క్షం అడిగిన‌న్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్న ప్ర‌భుత్వం… ఎప్ప‌టిలాగానే సీఎల్పీని త‌ట్టుకోలేక స‌భ‌ను వాయిదా వేసుకున్నారని విమర్శల జల్లు కురిపించారు. ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం. బిల్లు కోస‌మే ఈ శాస‌న‌స‌భా స‌మావేశాల‌ని మండిపడ్డారు. కేవ‌లం ఎఫ్‌.ఆర్‌.బీ.ఎం. బిల్లుకోస‌మే నిర్వ‌హించిన‌ట్లుగా ఉంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు… అప్పులు తెచ్చుకోవ‌డం కోసం అవ‌స‌ర‌మ‌య్యే బిల్లు స‌వ‌ర‌ణ కోస‌మే మీటింగ్ జ‌రిపింన‌ట్లు ఉంద‌ని అన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల పాలు అవుతుంద‌ని అన్నారు.ద‌క్షిణ తెలంగాణ‌ను ఏడారిలా మార్చేలా ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీ.ఓ. నెంబ‌ర్ 203పై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిప‌కుండా కేసీఆర్ ఎందుకు పారిపోయారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. . రాష్ట్రంలో నిరుద్యోగ, వ‌ర్షాల ద్వారా న‌ష్ట‌పోయిన రైతులు, ఆరోగ్య, పంచాయితీ రాజ్ సెక్రెట‌రీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ‌బుల్ బెడ్ రూమ్ కోసం ఎదురు చూస్తున్న పేద‌లు, క‌రోనాతో ఉద్యోగాలు కోల్పోయిన వారి స‌మ‌స్య‌లు.. ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయ‌ని.. వాటిపై చ‌ర్చించాల‌ని కోరాం. చేనేత కార్మికులు ఆరు నెల‌లుగా ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారని . గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకువ‌చ్చిన స‌బ్ ప్లాన్ మాదిరిగానే బీసీల కోసం స‌బ్ ప్లాన్ తీసుకురావాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎన్నో స‌మ‌స్య‌లు చ‌ర్చ‌కు రాకుండా ప్ర‌భుత్వం పారిపోయింద‌న్నారు. టీఆర్ఎస్ స‌భ్యులు వంద మంది ఉన్నా.. ఆరుగురు కాంగ్రెస్ స‌భ్యులు అడిగే ప్ర‌శ్న‌లకు జ‌వాబులు లేక పలాయ‌న మంత్రం ప‌ఠించార‌ని ఎద్దేవా చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!