Take a fresh look at your lifestyle.

అపర భగీరథులకు పాలాభిషేకం

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫోటోలున్న ప్లెక్సీలకు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు పాలాభిషేకం చేశారు. గోదారి నీళ్లను రంగనాయకసాగర్‌ ‌ప్రాజెక్టు నుంచి విడుదల చేయడాన్ని పురస్కరించుకుని సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌ ‌చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుండి సిద్ధిపేట ప్రాంతానికి నీళ్ల గోస ఉండేది. ఆ గోసను పోగొట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారనీ ప్రజాప్రతినిధులు, రైతులు సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌నుంచి గోదారి జలాలను విడుదల చేయడంను హర్షిస్తూ…జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో టిఆర్‌ఎస్‌ ‌యువ నాయకుడు దరిపల్లి శ్రీను ఆధ్వర్యంలో కేసీఆర్‌, ‌హరీష్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

నంగునూరు మండలంలోని గట్లమల్యాల, పాలమాకుల, ఆంక్షాపూర్‌, ‌జెపి తండా, పాలమాకుల తదితర గ్రామాల్లోనూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతులు సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గట్లమల్యాలలో ఐకెపి కేంద్రంలో రైతులతో కలిసి గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. బీడు భూములను రంగనాయక సాగర్‌తో సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌కు పాదాభివందనాలు చేస్తున్నామన్నారు. చిన్నకోడూరు మండలంలోని సికింద్లాపూర్‌లోనూ సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లను పంచి పెట్టారు.

Leave a Reply