Take a fresh look at your lifestyle.

రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

కల్నల్‌ ‌సంతోష్‌ ‌కుటుంబానికి పరామర్శ
‌రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత సరిహద్దుల్లో చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్‌ ‌సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం పరామర్శిస్తారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రభుత్వం అందగా ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల ఆర్థిక సాయం, సతీమణికి గ్రూప్‌ 1 ఉద్యోగంతో పాటు నివాస స్థలానికి సంబంధించిన పత్రాలను స్వయంగా సీఎం అందజేయనున్నారు. దీంతో సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేటలో కొరోనా కేసులు భారీగా నమోదైన నేపథ్యంలో కోవిడ్‌ ‌నిబంధనల మేరకు అధికారులు సీఎం కేసీర్‌ ‌పర్యటనను ఖరారు చేశారు.

Leave a Reply