Take a fresh look at your lifestyle.

నేడు కొడకండ్లలో.. రైతు వేదిక ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

రైతులకు అన్ని విధాలా అందుబాటులో ఉండేలా నిర్మిచిన తొలి రైతు వేదికను సీఎం కె.చంద్రశేఖరరావు శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రైతు వేదికను ప్రారంభిస్తారు. ఈ
సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5 వేల మంది రైతులతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడతారు.

అనంతరం రైతు వేదిక వద్ద ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,604 వేదికలను ప్రభుత్వం నిర్మిస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, పంట దిగుబడులు వంటి అంశాలపై చర్చించుకోవడం ఉద్దేశ్యంగా ఈ రైతు వేదికలను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ 5 వేల ఎకరాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రైతులకు సహాయంగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply