Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు

వైద్యుల ప్రకటన

‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు ప్రకటించారు. బుధవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌లో ఆయనకు యశోద వైద్యుల బృందం మరోసారి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈనెల 14న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌కు ఆ తరువాత స్వల్ప లక్షణాలతో బాధపడ్డారు. దీంతో ఆయనకు కోవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ ‌పాజిటివ్‌గా నిర్ణారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఫాం హౌస్‌లో యశోద హాస్పిటల్‌ ‌వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. తాజాగా, బుధవారం ఆయనకు నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలన్నీ నార్మల్‌గానే వచ్చాయనీ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్య బృందం పేర్కొంది.

Leave a Reply