Take a fresh look at your lifestyle.

సిఎం కెసిఆర్‌ ‌బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్క•తిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు.

కొరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు. కాగా కొరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపాపుతూ ట్విటర్‌ ‌ద్వారా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశం విడుదల చేశారు.

Leave a Reply