కాళోజీకి సీఎం పుష్పాంజలి

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం దిల్లీ వెళ్లారు. అక్కడి తన అధికార నివాసంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు మ‌ల్లు ర‌వి, రేణుకా చౌద‌రి, త‌దిత‌రులు కూడా నివాళులర్పించారు. అనంతరం ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు పార్లమెంటు నూతన భవనంంలోని ఎఫ్-101 వసుధ భవన్‌కు తరలివెళ్లారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *