Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణకు సిఎం జగన్‌ ‌కీలక నిర్ణయాలు

  • రాష్ట్రస్థాయిలో కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య 10కి పెంపు
  • పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు

అమరావతి,జూలై 20 : రాష్ట్రస్థాయిలో ఉన్న కోవిడ్‌ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అధికారులను ఆదేశించారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు అందించాలన్నారు. కరోనా నివారణ చర్యలపై వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌, ‌హెల్త్ ‌స్పెషల్‌ ‌సీఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి, టాస్క్ ‌ఫోర్స్ ‌చైర్మన్‌ ‌కృష్ణబాబు పాల్గొన్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలనే దానిపై రెండు రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి కోవిడ్‌ ఆస్పత్రుల మాదిరిగా ఈ ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న 5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవలకోసం సత్వర చర్యలు చేపట్టాలని.. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కోవిడ్‌ ‌సోకిందన్న అనుమానం వస్తే ఏంచేయాలి? ఎవర్ని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం నిర్వహించాలన్నారు. కోవిడ్‌ ఎవరికైనా వస్తుంది, ఆందోళన వద్దు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతుంది. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగ్స్ ‌పెట్టాలి. గ్రామ సచివాలయాల్లో కూడా ఈ హోర్డింగ్స్ ఉం‌డాలి. క్వారంటైన్‌ ‌సెంటర్ల సంఖ్య కన్నా క్వాలిటీ ద దృష్టి పెట్టాలి. కోవిడ్‌ ఉం‌దా? లేదా? అన్నది తెలుసుకోవడానికి ర్యాపిడ్‌ ‌టెస్టులు అందుబాటులోకి వచ్చినందున ఎవరిని ఎక్కడ పెట్టాలన్న దానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత వారికి మంచి సేవలు అందించాలని సూచించారు. అలాగే కాల్‌ ‌సెంటర్‌ ‌ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతుల ద ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. టెలి మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా? లేదా? మరోసారి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య రంగంలో చేపట్టనున్న నాడు?నేడు కార్యక్రమాలపై ఫోకస్‌ ‌పెంచాలన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలపాటు నిర్దేశిరచుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇవన్నీ పూర్తయితేనే కోవిడ్‌లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌పేర్కొన్నారు.

24 గంటల్లో 4,074 పాజిటివ్‌ ‌కేసులు
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,580 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల మొత్తం సంఖ్య 53,724 కు చేరింది. తాజా పరీక్షల్లో 17,385 పరీక్షలు ట్రూనాట్‌ ‌పద్ధతిలో చేయగా.. 16,195 పరీక్షలు ర్యాపిట్‌ ‌టెస్టింగ్‌ ‌పద్ధతిలో చేశారు. రాష్ట్రంలో కొత్తగా 1335 మంది వైరస్‌ ‌బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 24,228కి చేరింది.రాష్ట్రంలో కొత్తగా 54 మరణాలు సంభవిం చాయి.దీంతో మొత్తం మృతుల సంఖ్య 696 కు చేరింది.28,800 యాక్టివ్‌ ‌కేసులున్నాయి.నేటివరకు రాష్ట్రంలో13,49,112 నమూనాలను పరీక్షించారు. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొంది.

22న వనమహోత్సవంలో పాల్గొననున్న జగన్‌
ఈ ‌నెల 22న జూపూడిలో జరిగే వనమహోత్సవంనకు సీఎం జగన్‌ ‌హాజరవుతున్న సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్‌ అడిషనల్‌ ‌డీసీపీ రవి చంద్ర తెలిపారు. విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చు వాహనాలను హనుమాన్‌ ‌జంక్షన్‌ ‌వద్ద నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌ ‌నుంచి వచ్చు వాహనాలను నందిగామలో నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు నుంచి వచ్చు వాహనాలను గుంటూరు లోనే నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!