Take a fresh look at your lifestyle.

దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించండి

  • కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి సిఎం జగన్‌ ‌లేఖ
  • మహిళా పోలీసులు యాక్టివ్‌గా పనిచేయాలి
  • రెండువారాలకో మారు కలెక్టర్లు, ఎస్పీలు సక్షించాలి
  • దిశ పెట్రోలింగ్‌ ‌కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలు
  • దిశపై మరోమారు ఉన్నతస్థాయి సమిక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు

అమరావతి, జూలై 2 : దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని కేంద్రాన్ని సిఎం జగన్‌ ‌కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. దిశ చట్టం ఆమోదించాలంటూ సీఎం జగన్‌ ‌లేఖ ద్వారా స్మృతి ఇరానీని కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. కాగా ’దిశ’ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సక్ష చేపట్టారు. సక్షలో భాగంగా దిశ చట్టానికి సంబంధించి కేంద్ర మంత్రికి జగన్‌ ‌లేఖ రాశారు. ఈ సమావేశానికి •ంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలన్నారు.. ఫిర్యాదు చేయడానికి మహిళలు పీఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలి. దిశ యాప్‌పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ కల్పించాలి. ప్రతి 2 వారాలకోసారి కలెక్టర్‌, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు.. మహిళల భద్రతపైనా సక్ష నిర్వహించాలి. పోలీస్‌ ‌స్టేషన్లలో రిసెప్షన్‌ ‌వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దిశ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పీఎస్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని తెలిపారు. దిశ కాల్‌సెంటర్లలో అదనపు సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

మహిళల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడొద్దన్న ఆయన.. దిశ పెట్రోలింగ్‌ ‌కోసం కొత్తగా 145 వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 6 కొత్త దిశ పోలీస్‌ ‌స్టేషన్ల నిర్మాణానికి నిధులు త్వరగా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, విశాఖలో ల్యాబ్‌ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇక ఫొరెన్సిక్‌ ‌ల్యాబ్‌ల్లో ఇప్పటికే 58 పోస్టుల భర్తీకాగా… మరో 61 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఆమోదం తెలిపారు. అదే విధంగా గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

ప్రభుత్వం, పోలీసులపై దుష్పచ్రారం చేస్తున్న ఘటనల్లో.. నిజాలను ప్రజల ముందుం చాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో… ప్రీతి సుగాలి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో… తీసుకునే చర్యలను అధికారులు సీఎం వైఎస్‌ ‌జగన్‌కు వివరించారు. ప్రీతి సుగాలి తండ్రికి ఉద్యోగం ఇస్తున్నాం. ప్రీతి తల్లి కోరుకున్నట్లే ఆమెను కర్నూలు డిస్పెన్సరీలోనే కొనసాగిస్తున్నాం. 5 సెంట్ల ఇంటి పట్టా, ఐదెకరాల భూమిని కూడా ఇస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు.

Leave a Reply