Take a fresh look at your lifestyle.

రైతు పక్షపాతిగా నిలిపోతున్న సిఎం జగన్‌

పేద రైతులకు అండగా వైఎస్సాఆర్‌ ‌జలకళ పథకం
మరో అడుగు ముందుకు పడిందన్న మంత్రి పెద్దిరెడ్డి 

అమరావతి,సెప్టెంబర్‌ 26 : ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడంతో పాటు, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న విషయాన్ని ఆచరణలో చూపుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నదాతల కోసం వైఎస్సాఆర్‌ ‌జలకళ పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర గ్రాణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,340 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకం కింద 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వెల్లడిం చారు. రాష్ట్రంలోని కమాండ్‌, ‌నాన్‌ ‌కమాండ్‌ ఏరియాల్లో ఎక్కడైతే భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా వుంటాయో ఆ ప్రాంతాల్లో ’వైఎస్సాఆర్‌ ‌జలకళ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని తెలి పారు.

ప్రస్తుతం అందు బాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో వుంటాయో అక్కడే బోరుబావులు తవ్వేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పొలాల్లో  హైడ్రో జియోలాజికల్‌, ‌జియో గ్రాఫికల్‌ ‌సర్వే ద్వారా శాస్త్రీయంగా ఎక్కడ బోరుబావులను తవ్వాలో నిపుణులు గుర్తించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే సంబంధిత జియోలజిస్ట్ ‌నిర్ధేశిరచిన లోతులో మాత్రమే బోరు బావుల తవ్వకం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్‌ ‌చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్‌ ‌హార్వెస్టింగ్‌ ‌నిర్మాణాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడిగంటి పోకుండా శాస్త్రీయ పద్దతుల్లో బోరుబావుల తవ్వకం జరుగుతుందని, దీనివల్ల రైతుకు కూడా బోర్లు వేసిన కొద్దిరోజులకే బోర్లు అడిగంటి పోవడం, తరువాత మరోసారి బోర్లు వేసుకునేందుకు వ్యయం చేయాల్సిన అవసరం వుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

Leave a Reply