Take a fresh look at your lifestyle.

సిఎం జగన్‌ ‌కడప జిల్లా పర్యటన ఖరారు 8,9 తేదీల్లో బద్వేలులో పర్యటించనున్న జగన్‌

‌కడప,జూలై 5: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 8, 9వ తేదీల్లో ససిఎం జిల్లా పర్యటనకు రానున్నారు. 9వ తేదీ బద్వేలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన సుమారు రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు బద్వేలు పర్యటనకు రానున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బద్వేలుకు వస్తున్న వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు.

నెల 8, 9వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ‌సి.హరికిరణ్‌ ‌తెలిపారు. ఈ నేపథ్యంలో బద్వేలులోని పలు ప్రాంతాలను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ ‌సి.హరికిరణ్‌, ‌మాజీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్‌రోడ్డులోని బహిరంగ సభ స్థలాన్ని, హెలిప్యాడ్‌కు సంబంధించి సిద్దవటంరోడ్డులోని ఓ స్థలాన్ని, మైదుకూరురోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply