Take a fresh look at your lifestyle.

సొంతిల్లు నిర్మించుకోవాలనుకున్న పేదలకు సహకారం

  • సమర్థత ఆధారంగా వలంటీర్లకు నగదు అవార్డులు
  • సిఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

‌సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక వాలంటీర్లను సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో సత్కారం చేయాలని సిఎం జగన్‌ ‌సూచించారు. ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన.. 2,18,115 మంది వాలంటీర్లకు సేవామిత్ర 4వేల మంది వాలంటీర్లకు సేవారత్న ప్రతి మండలానికి ఐదుగురు, ప్రతి మున్సిపాలిటీకి ఐదుగురు ఎంపిక జరగాలని అన్నారు. ప్రతి కార్పొరేషన్‌ ‌నుంచి 10 మందిని ఎంపిక చేయాలన్నారు. నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సేవా వజ్రాలుగా ఎంపిక చేయాలన్నారు. 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం చేయాలన్నారు.

ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌ ‌రెడ్డి వాలంటీర్లకు అవార్డుల ప్రదానంపై గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులతో సవి•క్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సవి•క్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథ రాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేలు, సేవా వజ్రాలకు రూ.30వేల నగదు ప్రోత్సాహకం అందించాలని సూచించారు. ఇకపోతే పేదల గృహనిర్మాణానికి సంబంధించి తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్‌ ఎం‌చుకున్న వారికి.. నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని ఆయన అధికారులను సిఎం ఆదేశించారు.

స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని.. తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్‌ ‌జగన్‌, ‌కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా .. నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో .. నాణ్యత పాటించాలని అధికారులకు స్పష్టంగా చెప్పిన సీఎం, తయారు చేసిన డిజైన్లను పరిశీలించి సూచనలు చేశారు. జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వసతుల కల్పనపై కూడా సీఎం జగన్‌ ‌చర్చించారు. జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు.

Leave a Reply