- చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు చేయూత
- విద్యుత్ చార్జీలతో పాటు రుణాల మాఫీ
- ఇందుకోసం రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయం
- పరిశ్రమల యాజామాన్యాలతో సిఎం జగన్ సమీక్ష
అమరావతి,మే 22 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రభావం ఉన్నా..చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని నిర్ణయించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 6 నెలల మారిటోరియం ఉంటుందన్నారు. ఆ తర్వాత చెల్లించేలా పరిశ్రమలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేసీ పర్యవేక్షణలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భరోసా ఉంటుందని ప్రకటించారు.పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని నిర్ణయించారు.పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్య ంగల కార్మికులు అవసరమో గుర్తించాలి. 75శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. 6 నుంచి 8శాతం వడ్డీకే రుణాలు కల్పించేందుకు నిర్ణయించాం.పరిశ్రమ లకు అవసరమైన నైపుణ్యతను సాధించేందుకు 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల బలోపే తం కోసం’రీస్టార్ట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్ఎస్ఎమ్ఈ లకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించను న్నారు.శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎంఎస్ఎంఈలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందు కోసం రూ. 905 కోట్ల బకాయిలతో పాటు రూ.187 కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్ఎంఈలనుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకు న్నారు.ఇప్పటికే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకి విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.ఇక ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక బకాయి లను విడుదల చేయడంపై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధి డివి రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రోత్సాహక బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యుత్ డిమాండ్ ఛార్జీలు రద్దు చేయడ ంపై సీఎం వైఎస్ జగన్‌కు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణబాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.