Take a fresh look at your lifestyle.

ఎన్నికలు ఏవైనా ప్రభుత్వం సిద్దమే మంత్రులతో ఇష్టాగోష్టిలో సిఎం జగన్‌

తమ ప్రభుత్వం అన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ ‌భేటీ నిర్వహించారు. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ ‌భేటీ తర్వాత పలువురు మంత్రులతో సీఎం జగన్‌ ‌ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్‌ ‌చర్చించారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డిని ఈ భేటీలో జగన్‌ ‌ప్రశంసించినట్లు తెలిసింది.

ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుదామని జగన్‌ అన్నట్లు సమాచారం. వ్యాక్సిన్‌ ‌త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశముందని సీఎం భావిస్తున్నాట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో చరిత్రలో లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని మంత్రుల వద్ద సీఎం జగన్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్‌ ‌కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు.

తమ డిమాండ్‌లు ఏమిటో చెప్పాలని కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని మంత్రి పేర్కొన్నారు. చర్చల కోసం మంత్రులు, ఎంపీలు వెళ్లినా ఇష్టానుసారం బూతులు తిట్టి పంపించారని ఆయన ఆరోపించారు. తమ బొమ్మలు పెట్టి ఇష్టానుసారం దూషించారని ఆయన విమర్శించారు. విశాఖలో పాలనా రాజధాని వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అది అందరూ చూసే రోజు వస్తుందని మంత్రి పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply