Take a fresh look at your lifestyle.

ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్న సిఎం జగన్‌

  • మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శ
  • అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

విశాఖపట్టణం,అగస్టు 27 : ఉత్తరాంధ్రని సీఎం జగన్‌ ‌నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును అమ్ముతామని అంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. శుక్రవారం ఆయన డియాతో మాట్లాడుతూ ఈనెల 30న ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక నిర్వహిస్తామని ప్రకటించారు. స్టీల్‌ ‌ప్లాంట్‌ను అమ్మేస్తుంటే.. వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. సుజల స్రవంతి ప్రాజెక్ట్ ‌సహా పలు ప్రాజెక్ట్‌లను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలను ఎలా అమ్ముతారు? అని ప్రశ్నించారు. సింహాచలం భూములను, ప్రైవేట్‌ ఆస్తులను దోచుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

మరోవైపు మేజర్‌ ‌పోర్టుల ప్రైవేటీకరణ చేయకూడ దంటూ… అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం నిరసన చేపట్టారు. మేజర్‌ ‌పోర్టుల్లో ప్రాజెక్టుల అమ్మకం ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయ కులు పద్మరాజు, ఎఐటియుసి నాయకులు మస్తాన్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply