Take a fresh look at your lifestyle.

మద్య నిషేధ హాని విస్మరించిన సిఎం జగన్‌

‌మద్యం ఆదాయంతో మిన్నకున్నారని దేవినేని విమర్శలు
అమరావతి, జూలై 22 : ఎన్నికలకు ముందు ఇచ్చిన మధ్య నిషేధం హా ఆటకెక్కినట్టేనా? అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డిని మాజీ మంత్రి, టిడిపి నాయకలు దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ‌చేశారు. మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా జగన్‌ ‌సర్కారు కసరత్తు చేస్తోందని, మద్యాన్ని నియంత్రించడం కానీ, నిషేధించడం కానీ జరగదని అన్నారు. ఏడాదికి రూ.2,400 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా కొత్తగా 300 షాపులు తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు.

మద్యంపై పన్నులు చూపిస్తూ రూ.21,500 కోట్ల అప్పులు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. జగనన్న కాలనీలు సెలయేర్లను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని విమర్శించారు. ఇలాంటి చోట నివాసం ఎలా ఉండాలో చెప్పాలని లబ్దిదారులు చేస్తున్న ఆందోళన కనపడట్లేదా? అని ప్రశ్నించారు. భూముల కొనుగోళ్లు, మెరకల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, నేతల జేబులు నింపేందుకే నివాసయోగ్యం కాని భూముల్లో లేఔట్లు వేశారని ఆరోపించారు.

Leave a Reply