Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల సమస్యలపై సిఎం జగన్‌కు స్పష్టత

చంద్రశేఖర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో సజ్జల

అమరావతి, జూలై15 : ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పదవీ విరమణ పొందిన చంద్రశేఖర్‌రెడ్డి సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌ అమలు కాంప్లికేటెడ్‌ ఇష్యూ కావడంతో ఆలస్యమైందని, వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కృషి చేస్తున్నారని చేప్పారు.

ఒకేసారి లక్షా30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నామని, సీఎం జగన్‌ ‌స్పష్టతతో విప్లవాత్మక కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తుచేశారు.ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయంలో వైఎస్సార్‌కు ఉన్న విజన్‌ ‌సీఎం జగన్‌కు ఉందని గుర్తుచేశారు. సీఎం జగన్‌ ‌ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రం అప్పుల్లో ఉందని,గత ప్రభుత్వం 2లక్షల 60 వేల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని మండిపడ్డారు. పాలన గాడిన పడేలోపే కరోనా సంక్షోభం వచ్చిందని,  అయినా సంక్షేమ పాలన అందిస్తున్నామని తెలిపారు.

సర్వీస్‌ ‌మ్యాటర్స్ ‌నుండి ఫైనాన్షియల్‌ ఇష్యూస్‌ ‌వరకు అన్ని క్లియర్‌ ‌చేస్తామని తెలిపారు.చరిత్రలో ఒకేసారి లక్షా ముప్పై వేల రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇచ్చింది సీఎం జగన్‌ ‌ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. చంద్రశేఖర్‌ ‌రెడ్డిని ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నియమిస్తామని, త్వరలో దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి,  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ‌చైర్మన్‌ ‌గౌతమ్‌ ‌రెడ్డి,ఉద్యోగ సంఘాల నేతలు పాల్లొన్నారు.

Leave a Reply