Take a fresh look at your lifestyle.

ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి వైఎస్‌ఆర్‌

  • ‌వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో సిఎం జగన్‌
  • ‌ప్రజల నాడి తెలిసిన వ్యక్తి దివంగత వైఎస్సార్‌
  • ‌రైతు సంక్షేమానికి పాటుపడ్డ మహావ్యక్తి అన్న గవర్నర్‌

అమరావతి,నవంబర్‌ 1 : ‌నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్‌ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్‌ ‌పేరుద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ ‌సెంటర్‌లో వైఎస్సార్‌ ‌జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ ‌సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌, ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్‌ ‌విజయమ్మ హాజరయ్యారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, కేవలం సేవలను పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్క•తికి అవార్డుల్లో పెద్దపీట వేశామన్నారు. రైతులు, రచయితలు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్‌ను ఎంపిక చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలుగుజాతికి శుభాకాంక్షలు. సామాన్యులుగా ఉన్న అసామాన్యుల మధ్య సమయం గడపడం నా అదృష్టం. కేంద్రం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని పలు సూచనలు వచ్చాయి. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని వైఎస్సార్‌ ‌ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాం. నిండైన పంచెకట్టుతో వైఎస్సార్‌ ‌ప్రజల గుండెల్లో నిలిచారు. వైఎస్సార్‌ ఆకాశమంత ఎత్తు ఎదిగిన మహా మనీషి అని సీఎం కొనియాడారు.

ప్రతి సంవత్సరం నవంబర్‌ 1‌న వైఎస్సార్‌ అవార్డులు ప్రదానం చేస్తామని సీఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేస్తామన్నారు. అచీవ్‌మెంట్‌ అవార్డు పొందిన వారికి రూ.5 లక్షలు కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం అందజేయనున్నట్లు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తెలిపారు. వైఎస్సార్‌ ‌వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారని ఆంధ్రప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ అన్నారు. ‘ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌ ‌గొప్ప వ్యక్తిగా నిలిచారు. వైఎస్సార్‌కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ. పేదల నాడి తెలిసిన డాక్టర్‌ ‌వైఎస్సార్‌.. ‌వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల హృదయాలను గెలిచారని‘ గవర్నర్‌ అన్నారు. ఇక్కడి సంస్క•తి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడుని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు.

Leave a Reply