Take a fresh look at your lifestyle.

గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సిఎం జగన్‌

‌సిఎంకు స్వాగతం పలికిన ఆశ్రమ వాసులు

విజయవాడ,అక్టోబర్‌ 18 :  ‌విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సందర్శించారు. ముఖ్యమంత్రి ఆశ్రమంలోని సుప్ర గణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత రాజరాజేశ్వరీ దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ది హనుమాన్‌ ఆలయాలను దర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అవధూత, దత్తపీఠాధిపతి స్వామి గణపతి సచ్చిదానందని కలిశారు.   హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని కోరినట్లు వెల్లడించారు. సీఎం జగన్‌ను హిందూ విరుద్ధ వ్యక్తిగా కొందరు ప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రభుత్వం ఆలయాల పట్ల చిత్తశుద్ధితో ఉందని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు.

జగన్‌ ‌హిందూ ధర్మాన్ని, మతాన్ని పరిరక్షిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపి వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ‌చైర్మన్‌లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply