- పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గింది
- జనవరికల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం
- స్పందనపై అధికారులతో సిఎం జగన్ సమీక్ష
అమరావతి, సెప్టెంబర్ 29 : రాష్ట్రంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్‌తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. 104 నంబర్‌కు ఫోన్ కొడితే టెస్ట్‌లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి. ఈ నంబర్‌కు మాక్ కాల్స్ చేసి నెంబర్ పనిచేస్తుందా లేదా పీరియాడికల్‌గా చెక్ చేయండని అధికారులకు సూచించారు. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలన్నారు.
కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు. ఎంప్యానల్ హస్పిటల్స్ లిస్ట్ కూడా అందుబాటు లో ఉండాలని తెలిపారు. 104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్ చేసిన వారంతా కూడా కరెక్ట్‌గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్ చేయాలి. 37000 వేల బెడ్స్, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్, శానిటేషన్, ఇన్ఫ్రా, స్టాఫ్ వీటిపై మానిటరింగ్ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్‌గా ఉంటే చికిత్స కరెక్ట్‌గా అందుతుంది. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టి పెట్టాలి. కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. ఏఎన్ఎంలు, లోకల్ డాక్లర్లు మ్యాపింగ్ చేయాలి. డాక్టర్ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, పిహెచ్సీ డాక్టర్ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నంబర్ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్ కంట్రోల్‌రూమ్ నంబర్ కూడా పబ్లిసిటీ చేయాలని సీఎం సూచించారు. కోవిడ్ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో డియాతో కూడా యుద్దం చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్ వార్తలు చదువుదాం. మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. సక్షలో మంత్రలు ఆదిమూలం సురేశ్, ఆళ్లనాని, బొత్స, పెద్దిరెడ్డి, కన్నబాబు,సిఎస్ తదితరులు పాల్గొన్నారు.