Take a fresh look at your lifestyle.

రుయా ఘటనపై సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, : కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ఒక్కోసారి చేతుల్లో లేని ఘటనలు జరిగిపోతున్నాయని, రుయా ఘటన తీవ్రంగా కలచి వేసిందని సిఎం జగన్‌ అన్నారు. నిత్యం పటిస్ట చేర్యలు తీసుకుంటూ ఎంతో అప్రమత్తంగా ఉంటున్నా అనుకోని ఘటనలు వచ్చి పడుతున్నాయని అన్నారు. స్పందనలో భాగంగా జిల్లా కలెక్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కోవిడ్‌, ఉపాధి హా పనులు, వైఎస్సార్‌ ‌జలకళ, వైఎస్సార్‌ అర్బన్‌ ‌క్లినిక్స్, ‌హౌసింగ్‌, ‌స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధతపై సీఎం సక్షించారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని..  రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు.

తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్‌ ‌కొరత ఏర్పడిందని.. 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్‌ ‌పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే నిన్నకూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్‌ ‌పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌ ‌లిప్ట్ ‌చేశాం. అక్కడ నింపి… రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్‌ ‌కొనుగోలు చేసి షిప్స్ ‌ద్వారా తెప్పిస్తున్నాం. ఇన్నిరకాలుగా ఆక్సిజన్‌ ‌కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడంవల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా… చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది.  కోవిడ్‌ ‌కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉందని సీఎం అన్నారు.18ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటి వరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోంది. 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాలి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారు.

వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసని అయినా విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. డబ్బులు తీసుకుని మాకు సప్లైచేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫిడవిట్‌లో దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. ఇలాంటి పరిస్థితి ఉండి కూడా చంద్రబాబు, కొన్ని డియా సంస్థల వాళ్లు చేస్తున్న ప్రచారాలు ఒక్కసారి చూడండి. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఇచ్చారు. రూ.1600 కోట్లు ఇవ్వలేరా? కషన్లు కోసం చూస్తున్నారు? అని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడుతున్న ఈ మాటలను పతాక శీర్షికల్లో వేస్తున్నాయి. ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌, ‌బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అదించగలుగుతున్నాం. మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్‌, ‌వాలంటీర్‌ ‌స్థాయి వరకూ ఎంతో కమిట్‌మెంట్‌గా చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం. అయినా సరే కొన్ని కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. అయినా సరే.. మరింత సమర్థవంతంగా, మానవత్వంగా, సానుభూతి చూపించి పనిచేద్దాం. జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లోడియా ఉందన్నారు. పలువురు మంత్రులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.

Leave a Reply