Take a fresh look at your lifestyle.

సిఎం జగన్‌ ‌తిరుపతి సభ రద్దు

  • కొరోనాతో రద్దు చేసుకున్నట్లు సిఎం లేఖ
  • 22 నెలల పాలనను దృష్టిలో పెట్టుకుని వోటేయాలని వినతి

ఏపీ సీఎం జగన్‌ ‌తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ ‌తిరుపతి ప్రజలకు శనివారం బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఎన్నికల ప్రచార సభకు రాలేకపోతున్న. నేను సభకు వస్తే వేలాదిగా వచ్చే జనంతో వి• ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యమే నాకు ముఖ్యం. నేను వ్యక్తిగతంగా హాజరుకాలేకపోయినా వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ‌గురుమూర్తికి ఓటు వేయాలి. నిన్న ఒక్కరోజే 2,765 కేసులు వచ్చాయి. తిరుపతి పార్లమెంట్‌ ‌నియోజవర్గం పరిధిలోని చిత్తూర్‌ ‌జిల్లాలో 496 కేసులు, నెల్లూరు జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని సీఎం జగన్‌ ‌లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌బహిరంగ లేఖ రాశారు. వి• అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో వి•కు చేసిన మంచి వి• అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా.గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం వి•కు చేరిందని భావిస్తున్నా. డా.గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. వి• అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని‘  లేఖలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply