Take a fresh look at your lifestyle.

శివాలయాలకు పోటెత్తిన భక్తజనం

  • దీ,సముద్ర స్నానాలతో తరించిన భక్తజనం
  • పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
  • ప్రధాన శైవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
  • గుడివాడలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సిఎం జగన్‌, ‌మంత్రి నాని

‌శివరాత్రిని పురస్కరించుకుని ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచాయారమ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసి శైవాలయాల్లో పూజలు నిర్వహించారు. అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాళహస్తి తదితర పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా గుడివాడలోని ఎన్టీఆర్‌ ‌స్టేడియంలో నిర్వహిస్తున్న శివరాత్రి మహోత్సవాల్లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్‌ ‌ప్రత్యేక పూజల్లో పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

విజయవాడ కృష్ణానదిలోని పున్నమిఘాట్‌, ‌కృష్ణవేణి, పవిత్ర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలతో మొక్కులను చెల్లించుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయనాకి భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసారు. తెల్లవారుజామునుంచే శివుడికి భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి..స్వామివారిని దర్శించుకున్నారు. జగ్గయ్యపేట మండలం ముత్యాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. తోట్లవల్లూరు మండలం ఐలూరు రామేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శైవలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. త్రిపురాంతకం, భైరవకొన, జమ్ములపాలెం, సోపిరాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

శివరాత్రిని పుస్కరించుకుని పట్టిసీమ కేత్రానికి భక్తులు తరలివచ్చారు. అటు పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరోవైపు పట్టిసీమ పట్టిసాచలక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరభద్రేశ్వర స్వామికి వంశపారంపర్య ధర్మకర్తలు తొలిపూజ నిర్వహించారు. సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో శివాలయం మారుమోగుతోంది. స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు.

తిరుపతి కపిలతీర్థంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. కపిలతీర్థం జలపాతం దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై మహిళలు పిండి దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌, ‌కోటిలింగాల ఘాట్‌లో భక్తులు పోటెత్తారు. ఏలేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలేరు నది తీరంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు.

Leave a Reply