మధిర, మే 22 (ప్రజాతంత్ర) : మండల పరిధిలోని ఇల్లెందులపాడు సమీపంలోని గణేష్ మిల్లులో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సిఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా సిసిఐ పత్తి కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన పత్తిని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని తెలిపారు.
పత్తి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జవ్వాజి ఆనందరావు, వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు, నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దారా బాలరాజు, జహంగీర్, తలుపుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.