Take a fresh look at your lifestyle.

గోదావరి కోత ప్రాంతాన్ని పరిశీలించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

ములుగు జిల్లా మంగపేట, పొదుమూరు గ్రామాల సమీపంలో గోదావరి వరద ఉధ్రుతికి కోత నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. మంగపేట సమీపంలో గోదావరి కోతకు గురవుతున్న ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యురాలు సీతక్కతో కలిసి బుధవారం పరిశీలించారు. గోదావరి కోత వల్ల సుమారు 18 కిలోమీటర్ల మేర రైతులు భూములు కోల్పోయే అవకాశం ఉందని ఈ సందర్భంగా భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల భూములతో పాటు మంగపేట గ్రామ ఉనికి కూడా భవిష్యత్‌లో ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గోదావరి కోత నియంత్రణ పనులకై ఉమ్మడి రాష్ట్రంలో రూ.40 కోట్లలను కేటాయించగా ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం రూ.130 కోట్లతో పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు జీఓ కూడా విడుదల చేసింది. అయితే పాత జీఓను రద్దు చేసి కొత్త జీవోను పరిగణనలోకి తీసుకోవటంతో ఈ వ్యవహారం కాగితాలకే పరిమితం అయ్యిందని భట్టి తెలిపారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని టెండర్లు పిలవాలని సీఎల్పీ నేత భట్టి డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply