Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి పట్టు ‘భట్టి’

కరోనా కట్టడిలో మధిర ఎ మ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (డి)లా కృషి చేస్తున్నారు. ఆపత్కాల సమ యంలో తనను గెలిపించిన ప్రజల కోసం ప్రజల మధ్య ఉంటూ.. అనుని త్యం ప్రజా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తూ మధిర నియోజకవర్గ ప్రజల మనన్నలు పొందుతున్నాడు. గతంలో ఎన్నడు లేని విధంగా సీఎల్‌పి నేత, మధిర శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క మార్చి 26 నుంచి గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజలకు కరోనా వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ .. స్వయంగా మాస్కులు, శానిటైజర్లు ..నిత్యవసర వస్తువులు పంపిణి చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు నేపధ్యంలో నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులతో సంప్రదిం పులు చేస్తూ అందరిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కరోనా మహమ్మారిపై ప్రజలందరూ పోరుకు సిద్ద కావాలని పిలుపునిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

ఒకే ఒక్కడు…
కరోనా మహమ్మారి నేపధ్యంలో లాక్‌ ‌డౌన్‌ ‌నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ… ప్రజలకు నిత్యవసర వస్తువులు..కూరగాయలు,మాస్కులు, శానిటై జర్లు అందించేందుకు సిఎల్‌పి నేతగా ఉన్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఏలాంటి హంగు ఆర్బాటం లేకుండా ఒకే ఒక్కడిలా ప్రజలోకి వెళ్తున్నారు. స్ధానిక సమస్యలు తెలుసుకుంటూ.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిత్యవసర సరుకులు, నగదు జమ వంటి అంశాలను తెలుసుకుంటూ సమస్యలున్న చోట వెంటనే అధికారులతో మాట్లాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

- Advertisement -

సరుకులు అందిస్తూ…
నియోజకవర్గంలో పూటగడవని నిరుపేద కుటుంబాలకు భట్టి విక్రమార్క అపన్నహస్తం అందిస్తున్నారు. నియోజకవర్గంలోని మధిర, బొనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, మండలాలలో గ్రామాలలో పర్యటిస్తున్నారు. ముదిగొండ, మధిర నగరం, బోనకల్లు మండలంలో పలు పేద కుటుంబాల కు 20 కిలోల బియ్యం , నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందించారు. అలాగే పలు టోల్‌గేట్ల, చెక్‌పోస్టుల వద్ద ప్రజాసేవలో ఉన్న పోలీసులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి ,రెవెన్యూ , పంచాయతీరాజ్‌ అధికారులకు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు అందించారు. ప్రత్యేకంగా మాస్కులు అందించే సమయంలో ఆయనే స్వయంగా డెటాల్‌ ‌నీటిలో వాటిని శుభ్రం చేసి ఇచ్చారు. పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు. ప్రజా సేవలో జిల్లా యంత్రాంగం విశేష కృషి చేస్తుందని భట్టి స్వయంగా వారికి అభినందనలు తెలిపారు.

సూచనలు చేస్తూ..
కరోనా వ్యాధి నిర్మూలనకు వైద్యం లేదని నివారణ ఒక్కటే మార్గమని ప్రజలకు భట్టి అవగహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని పిలుపునిస్తున్నారు.మాస్కులు ధరించి..శానిటైజర్‌ ‌లేక సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని భట్టి ప్రజలకు వివరిస్తున్నారు. కరోనా మహమ్మారిని తేలికగా తీసుకోవద్దని జాగత్త్రలు పాటించాలని చెబుతున్నారు. పేదలకు ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకో వాలని వైద్యసిబ్బంది ప్రజలకు అవగహన కల్పించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply