- క్లబ్ చేయటాన్ని విరమించుకోవాలి
- సిఐటియు జిల్లా నాయకుడు నాగేశ్వరరావు

పటాన్‌చెరు: అంగన్ వాడీ కేంద్రాలను మూసి వేయడం. క్లబ్ చేయటాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు బి నాగేశ్వర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను మరింత వేగవంతం చేస్తుందన్నారు. గతంలో కంటే ఐసిడిఎస్ బడ్జెట్ ఎప్పటికప్పుడు తగ్గించి చేస్తున్నారని మండిపడ్డారు.
దీనివలన అంగన్వాడీ వేతనాలు పోషకాహార బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని వాపోయారు. నగదు బదిలీ అంశాన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ చేయాలని చూస్తోందన్నారు. పదిమంది స్కూల్ పిల్లలు ఉన్నా పూర్తిగా ఎత్తివేసే ఆలోచన చేస్తోందన్నారు. గ్రామానికి ఒక ఉండే విధానం తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే ప్రారంభమైందని ప్రభుత్వ చర్యల వలన అంగన్‌వాడీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి జనవరి 8న జరిగే సమావేశంలో అంగన్వాడీ టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Tags: icds, anganwadi salary, nda govt, anganwadi centers