Take a fresh look at your lifestyle.

మూతపడుతున్న ప్రభుత్వ బడులు !

Closing government schools!

కేవలం కొంతమందికి స్వంతం అవుతున్న నాణ్యమైన విద్యావ్యవస్థ. సమాజ మార్పుకు పునాదులు వేసే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ,బీసి. మైనారిటీ, విద్యార్థులే అధిక సంఖ్యలో చదువు కుంటున్నారనే నెపంతో వీరిని బాల్యంలోనే విద్య నుండి దూరం చేయాలనే ఆలోచనా ధోరణితో ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులను ప్రభుత్వాలు కల్పించకపోవడం, రోజు రోజుకు ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య అని చెప్పవచ్చు. నాణ్యమైన నాటి విద్యావ్యవస్థ ఏదీ నేడు కనబడటం పల్లెటూరి బడులు మూతపడుతూ పట్టణాల్లో ఉన్న కార్పొరేట్‌ ‌బడులు ప్రభుత్వ విద్యను వెక్కిరిస్తుంటే నా బడుగు జాతులకు అందాల్సిన విద్య అందని ద్రాక్షలా మారింది.’’ఆకారం లేని రూపమా నీకెందుకు ఇంత ఆడంబరం’’ అనే విధంగా విర్రవీగే నేటి కార్పొరేట్‌ ‌యాజమాన్యాలకు, దీటుగా నేటి అణగారిన జాతి విద్యార్థులు అన్ని రంగాల్లో దేశం గర్వించేలా తమ ప్రతిభను కనబరుస్తున్నా గాని వారి పక్షాన ప్రభుత్వం నిలబడకపోవడం శోచనీయం. 7దశాబ్దాల స్వాతంత్య్ర అనంతరం దేశ అభివృద్ధికై ఉపయోగపడే సమగ్ర శాస్త్రీయ విద్యావిధానం నేటికి లేదనటంలో ఆశ్చర్యం లేదు.’’ ప్రభుత్వం నాణ్యమైన విద్య ను అందించక పోగా , ప్రైవేటు కార్పొరేట్‌ ‌పాఠశాలలు అధిక ఫీజులు వసూలుచేస్తున్న వాటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫిజులు కట్టలేక, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను ప్రభుత్వాలు అందించలేక, ‘‘బడిలో ఫిజుల భారం, ఇంట్లో కిడ్నీల బేరం’’అనే విధంగా ఉన్నది పేద విద్యార్థుల కుటుంబాల గోస.

కేవలం విద్యను వ్యాపారంగా మలుచుకొని ప్రభుత్వ అండదండలతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు గ్రామాల్లో ఉన్న పాఠశాల పరిస్థితులను గమనించి, తక్షణమే విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టి, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులని ఖాలీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలి సామాజిక మార్పులకు అనుగుణంగా పాఠశాలల భౌగోళిక పరిస్థితులని మార్చి, గ్రామ అభివృద్ధికి పునాదులు వేయాలి. సమసమాజ నిర్మాణానికి పునాది మన సర్కారు బడి అని మర్చిన అధికారులు ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించినవారే. కదం కదం కలుపుదాం కూల్లిపోతున్న ప్రభుత్వ విద్యాప్రమాణాలను కాపాడుదాం. దేశంలో శాస్త్రీయ విద్యా విధానంకై, విద్యారంగంలో మార్పులకై విద్యార్థులంతా సంఘటితం కావల్సిన అవసరం ఎంతగానో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఈ దేశంలో ఉచిత విద్య, వైద్యంను ప్రభుత్వాలు నిరుపేద ప్రజానీకానికి అందిచగల్గినట్లైతే పేదరికం నిర్ములించబడుతుంది. విద్య వివేకాన్ని సామాజిక మార్పును ప్రేరేపిస్తాయని పాలకులు గుర్తించి విద్యారంగాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

చెల్పూరి శ్రీకాంత్‌, ఎంఏ ‌పబ్లిక్‌ అడ్మిన్స్ట్రేషన్‌
‌కాకతీయ యూనివర్సిటీ :వరంగల్‌
‌సెల్‌: 8297975713.

Leave a Reply