- కలియతిరిగిన మంత్రులు
- కాంగ్రెస్, బిజెపిల దూకుడు
- 22న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఈనెల 22న ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఈనెల 24న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు,వేమలు ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసరావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బిజెపి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపిలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తదితరులు ప్రచారంలో దూసుకుని పోయారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపికోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు కూడా జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తంగా ప్రధాన పార్టీలకు మున్సిపోల్స్ సవాల్‌గా మారాయి. అధికార పార్టీ అభ్యర్థులకు పక్కలో బల్లెంలా బరిలో నిలిచిన రెబల్స్ కొన్నిచోట్ల టీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలు స్థానాల్లో వారు గెలుపోటములను ప్రభావితం చేసే చాన్స్ ఉండటం గులాబీ లీడర్లకు గుబులు పుట్టిస్తోంది. ఆరేండ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ తమను గెలిపిస్తాయని, పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం కలిసొస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసుకుంటోంది. ఎంఐఎంతో ఉన్న దోస్తీ తమకు లాభదాయకమని భావిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండటంతో అదే హవా ఇక్కడ కలిసొస్తుందని బీజేపీ భరోసాతో ఉంది. ప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు తమను గ్టటెక్కిస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలున్న చోట పార్టీ బలంగా ఉందని, అన్నిచోట్ల గట్టి పోటీనిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టిన ఎంఐఎం.. అదే నినాదంతో కొన్ని సీట్లపై ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్తో ఉన్న దోస్తీ తమకు కలిసొస్తుందని బేఫికర్‌గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే టీఆర్ఎస్ ఈ ఎన్నికలకు శక్తియుక్తులన్నీ ప్రదర్శించింది. ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించటం మొదలు.. బేరసారాలు, ఒప్పందాలు, బుజ్జగింపులన్నీ ప్రయోగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ మోహరించింది. సీఎం కేసీఆర్ రెండుసార్లు టింగ్ పెట్టడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌కు ముందే రాష్ట్రంలో 80 వార్డులు, రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. అందులో 79 స్థానాలు టీఆర్ఎస్, మూడు ఎంఐఎం ఖాతాలో పడ్డాయి. రామగుండం కార్పొరేషన్‌తోపాటు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, దుబ్బాక, కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల, వేములవాడలోనూ రెబల్స్ ఆ పార్టీని వెంటాడుతున్నారు. భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, శంషాబాద్, ఆమనగల్, అయిజ, సూర్యాపేట మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి అన్ని వార్డుల్లో తన వర్గీయులను రెబల్స్‌గా పోటీకి దింపారు. పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్?రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో పోటీపడి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, బీజేపీ ఓట్లు చీల్చటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏడు కార్పొరేషన్లతో పాటు 47 మున్సిపాలిటీలపై బీజేపీ దృష్టి పెట్టింది.
కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, నిజాంపేట, జవహర్‌నగర్, ర్‌పేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ మేయర్ పీఠాలపై బీజేపీ ఆశలు పెంచుకుంది. ప్రధానంగా నిర్మల్, భైంసా, చెన్నూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట, కాగజ్‌నగర్, జనగాం, కోరుట్ల, రాయికల్, ఆదిలాబాద్, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, కోదాడ, తిరుమలగిరి, సూర్యాపేట, నారాయణఖేడ్, మహబూబ్ నగర్, భూత్పూర్, గద్వాల, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, కొల్లాపూర్, నారాయణపేట, మక్తల్, పరకాల, వర్ధన్నపేట, చొప్పదండి, కొత్తపల్లి, సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, జమ్మికుంట, దుబ్బాక, బోధన్, ఆర్మూర్, భీంగల్, ఎల్లారెడ్డి, తుక్కుగూడ, గుండ్ల పోచంపల్లి, మణికొండ, నార్సింగి, కొంపల్లి, పరిగి మున్సిపల్ స్థానాల్లో టీఆర్ఎస్కు బీజేపీ సవాల్ విసురుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ముఖ్య నేతలు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ప్రచారం •రెత్తిచ్చారు. ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు తమ సెగ్మెంట్లలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మళ్లీ పట్టు చాటుకునేందుకు ప్రయత్నించారు. ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. 9 కార్పోరేషన్లలోని 325 వార్డుల్లో 1,438 పోలింగ్ కేంద్రాలు, 120 మున్సిపాలిటీల్లోని 2, 727 వార్డుల్లో 6, 325 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ పేర్కొన్నది.
Tags: caa, nrc, mim with trs party, congress