Take a fresh look at your lifestyle.

మూతపడ్డ పరిశ్రమలు… ‘ఊపిరి’ పీల్చుకుంటున్న నదులు..!

‘కొరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మార్చి 24 న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ కాలంలో నదులు ఊపిరి పీల్చుకున్నాయి. కొరోనా వలన నదులు శుభ్ర పడ్డాయి.  యమునా నది సులభంగా శుభ్రం అయ్యే అవకాశం ఉందని ఈ కాలం సూచించినట్లు అయ్యింది.అలాగే గంగానది పరిస్థితి కూడా వుంది..’ 

- Advertisement -

  • యమున పరిశుభ్ర మయింది
  • పెరిగిన గంగ నీటి నాణ్యత

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ : లాక్డౌన్ సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్ ‌లో పారిశ్రామిక యూనిట్లు మూసివేయడం వలన యమునా నదిలోకి విష వ్యర్ధాల విడుదల ఆగిపోయి యమునానది నీటి నాణ్యత మెరుగుపడింది అని ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ రాఘవ్ చాధా తెలిపారు.”లాక్డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు కార్యాలయాలు మూసివేయబడ్డాయి, అందువల్ల యమునా శుభ్రంగా కనిపిస్తోంది. పారిశ్రామిక కాలుష్య కారకాలు పారిశ్రామిక వ్యర్థాల నిలుపుదల ఖచ్చితంగా యమునా నీటి నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపింది. నీటి నాణ్యత నిర్ధారించడానికి మేము నీటి పరీక్షలను నిర్వహిస్తాము. నీటిలో నాణ్యత చాల మెరుగు పడింది” అని రాఘవ్ చాధా అన్నారు. “గంగా నదిలో పదోవంతు కాలుష్యం పరిశ్రమల నుండి వస్తుంది. లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూసివేయబడినందున, పరిస్థితి మెరుగు అయ్యింది. గంగా నది నీటి నాణ్యతలో 40-50 శాతం అభివృద్ధిని మేము చూశాము. ఇది గణనీయమైన అభివృద్ధి,” అని డాక్టర్ ఐఐటి-బిహెచ్‌యు కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ పికె మిశ్రా అన్నారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ / బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ పి.కె మిశ్రా ఇలా అంటున్నారు “ నదిలో కనిపించే పొల్యూషన్ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లోడ్ మొత్తంలో 30% గంగా నది వెంట ఉన్న పరిశ్రమల వలన రోజుకు 130 నుండి 150 టన్నుల పారిశ్రామిక వేస్ట్ గంగలోకి వస్తుంది. . గంగాలోకి పోసిన మొత్తం పరిశ్రమల వేస్ట్ ప్రవాహం 6500 నుండి 6700 MLD (మానుల్ లింఫ్ డ్రైనేజీ)గా వుంది. లాక్డౌన్ కారణంగా అన్ని పెద్ద కాలుష్య పరిశ్రమలు మూసివేయబడినందున, ఈ విష భారం గంగా నదిలోకి ప్రవేశించడం లేదు.ఫలితంగా నదికి బాగా కాలుష్య భారం తగ్గింది. ప్రధాన నగరాల నుండి వచ్చే మురుగునీటి కాలుష్యం కారణంగా మాత్రమే ఇప్పుడు గంగా నదిలో కాలుష్యం వుంది.”

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మార్చి 24 న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ఈ కాలంలో నదులు ఊపిరి పీల్చుకున్నాయి. కరోనా వలన నదులు శుభ్ర పడ్డాయి. యమునా నది సులభంగా శుభ్రం అయ్యే అవకాశం ఉందని ఈ కాలం సూచించినట్లు అయ్యింది.అలాగే గంగానది పరిస్థితి కూడా వుంది. భారతీయుల ఆరాధ్యం అయిన గంగను శుభ్రం చేస్తామని ప్రభుత్వాలు ఎన్నో పధకాలు ప్రకటించాయి.రాజీవ్ గాంధీ హయాంలో మొదలుకున్న పధకాల జాబితా ఇలా వుంది. 1986లో గంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినప్పుడు, గంగా నదిని శుభ్రం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం సుమారు 5000 కోట్ల రూపాయలు కేటాయించింది.ఈ ప్లాన్ ఫెయిల్ అయిపోవటంతో గంగా కార్యాచరణ ప్రణాళిక 31 మార్చి 2000 న ఉపసంహరించబడింది. మన్ మోహన్ సింగ్ ప్రధానిగా జాతీయ గంగా రివర్ బేసిన్ అథారిటీ (ఎన్‌ఆర్‌బిఎ) ప్రకటించారు. ఫిబ్రవరి 2009 లో ఏర్పడిన జాతీయ గంగా రివర్ బేసిన్ అథారిటీ నదుల కాలుష్య నియంత్రణ సంస్థగా పనిచేయటానికి, గంగాను పరిరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం కోసం 44 పట్టణాల్లో 56 పథకాలను నిర్వహించడానికి ఎన్‌ఆర్‌బిఎకు 3,031 కోట్ల నిధులు మంజూరు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక ‘మా గంగ నన్ను పిలిచింది’…. అంటూ వారణాసిలో ప్రకటించారు.

అటుపై గంగా పరిరక్షణ శుభ్ర పరచటం కోసం నమామి గంగే ప్రాజెక్ట్ ప్రకటించారు. ‘నమామి గంగే’ అనే గంగా పరిరక్షణ మిషన్‌కు బడ్జెట్‌ను నాలుగు రెట్లు పెంచి 100% కేంద్ర నిధులతో పథకానికి 2019-2020 గాను 20,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రధాన మంత్రి నిర్ణయించారు. ఇవి కాకుండా వరల్డ్ బ్యాంకు ఒక బిలియన్ డాలర్లు ఇచ్చింది. గంగా నది క్లినింగ్ కోసం. 1885 నుంచి 2020 వరకు వివిధ పధకాల ద్వారా కేటాయించిన మొత్తం నిధులలో సుమారు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి. అయినా గానీ గంగా నది శుభ్ర పడలేదు.ఇంత కాలం గంగానది అభివృద్ధి అనే ముసుగులో పరిశ్రమల మురికి మోస్తూ వచ్చినది. కరోనా రూపంలో మనిషి లాభాపేక్షకు చెక్ పడటంతో నదులకు ఊపిరి ఆడింది. మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ , ఇతరత్రా పరిశ్రమల వ్యర్ధాలు నదిలోకి రావటం ఆగిపోవటంతో నదులలో ‘ఏ కేటగిరి’ నీళ్లు లభ్యం అవుతున్నాయి. ఒకప్పుడు స్నానానికి పనికి రాని నీళ్లు ఇప్పుడు నేరుగా తాగవచ్చు అని ప్రభుత్వ పర్యావరణ సంస్థలే చెబుతున్నాయి. ఇంతకాలం మనుషుల మలం వలనే నదులు కలుషితం అయిపోతున్నాయి, అని ప్రభుత్వం చెప్పిన డొల్ల మాటల చెత్తను గంగానది తన ప్రవాహంతో కొట్టివేసింది. దేశ నదులు తాము ఎలా శుభ్ర పాడతామో నిండుగా నిర్మలంగా ప్రవహించి కరోనా పాఠాలు చెబుతున్నాయి.

Leave a Reply