Take a fresh look at your lifestyle.

ఆస్ట్రేలియాలో వాతావరణ సంక్షోభానికి కారణం.. అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే

ఆ‌స్ట్రేలియాలో మాత్రమే కాదు, అమెరికా  జపాన్‌ ‌వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాతావరణ సమతూక స్థితిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. వార్మింగ్‌ ‌రెండు డిగ్రీల సెలిసియస్‌కు దిగువన ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ‌ప్లాంట్ల నుంచి వెలువడే వాయువుల వల్ల కార్బన్‌ ‌వాయువులు అధిక మవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశాల్లో  మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఉన్న జెఎం ముస్కర్‌ ఆ‌స్ట్రేలియాని ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నా, ఉద్గారాల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. 

Climate Crisis in Australia

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో దావానలం గురించిన వార్తలు, టెలివిజన్‌ ‌చానల్స్‌లో వాటి చిత్రాలు యావత్‌ ‌మానవాళిని కలచివేస్తున్నాయి. ఆస్ట్రేలియా ఇక ఎంత మాత్రం వాతావరణం గురించి అశ్రద్ధ చేసినా మరింత ప్రమాదమే. కార్చిచ్చు గురించిన చిత్రాలు టెలివిజన్‌ ‌చానల్స్‌లో వీక్షిస్తేనే మనసు కలచివేస్తోంది. అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఫెన్సింగ్‌ల మధ్య చిక్కుకున్న పశువులు అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాలు జనాన్ని కదిలిస్తున్నాయి. అక్కడ కార్చిచ్చు వల్ల సంభవిస్తున్న నష్టం, విషాదం మాటలకు అందనిది. కంగారూలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. వేలాది మంది అగ్ని జ్వాలల వేడిమిని తట్టుకోలేక సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలు, పట్టణాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఆహుతి అయిన వారి సంఖ్య లెక్కలకు అందనిది. బెల్జియమ్‌ ‌దేశమంత పరిమాణంలో ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వ్యాపించింది. దట్టంగా పొగ వ్యాపిస్తుండటంతో సిడ్నీ వంటి మహానగరాలలో కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భూతాపాన్ని అరికట్టేందుకు అనుసరించాల్సిన విధానాలను ఇంతకాలం విస్మరించిన కారణంగానే పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. భూతాపాన్ని తగ్గించడానికి తీసుకోవల్సిన చర్యలను దశాబ్దాలుగా విస్మరిస్తూండటం వల్లనే దానికి ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లిస్తోంది. 2030 నాటికి ఉద్గారాల తగ్గింపు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు చాలినన్ని చర్యలు తీసుకోవడం లేదు. 2017 నాటి లక్ష్యాలను ఆస్ట్ల్రేలియా చేరుకోలేదు. ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు, అమెరికా జపాన్‌ ‌వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాతావరణ సమతూక స్థితిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. వార్మింగ్‌ ‌రెండు డిగ్రీల సెలిసియస్‌కు దిగువన ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ‌ప్లాంట్ల నుంచి వెలువడే వాయువుల వల్ల కార్బన్‌ ‌వాయువులు అధిక మవుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశాల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఉన్న జెఎం ముస్కర్‌ ఆ‌స్ట్రేలియాని ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నా, ఉద్గారాల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. 1997 నాటి క్యోటో ఒప్పందాన్ని ఆస్ట్రేలియా గౌరవించలేదని, అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఉద్గారాల తగ్గింపు విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ఆయన అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆస్ట్రేలియాలో ప్రస్తుత పరిస్థితి గుణపాఠమని ఆయన అన్నారు. శిలాజ ఇంధనాల వినియోగం 2.4 బిలియన్‌ ‌టన్నులకు చేరుకుందనీ, ఆస్ట్రేలియాలో ఇప్పుడు వెలువడుతున్న గ్రీన్‌ ‌హౌస్‌ ఉద్గారాలకు ఐదు రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. పారిస్‌ ఒప్పందాన్ని ప్రపంచంలో ఏ దేశమూ గౌరవించడం లేదు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంతో మిగిలిన దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పుడున్న ఉద్గారాలకు తోడుగా కార్బన్‌ ‌వాయువులను విడుదల చేసే 115 ప్రాజెక్టులను నెలకొల్పేందుకు సంపన్న దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అభివృద్ధి పేరిట పర్యావరణానికి చేటు తెస్తున్నాయి. 2019లో ఆస్ట్రేలియన్‌ ‌సెక్యూరిటీ ఎక్స్‌చేంజిలో 50 కంపెనీలు కొత్తగా నమోదు అయ్యాయి. స్వదేశంలో కార్చిచ్చు వ్యాపించి జనం భయాందోళనలతో దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ ‌మారిసన్‌ ‌హవాయిలో విశ్రాంతి యాత్ర జరుపుతుండటాన్ని జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. శిలాజ ఇంధనాల వినియోగం వల్ల ఉద్గారాల పరిమాణం నానాటికీ భీతికొల్పే స్థితికి చేరుకుంటోంది.

Tags: Victoria State, Climate Crisis, Australia, policies followed, government,United Nations, Climate Summit

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply