Take a fresh look at your lifestyle.

పర్యావరణ విధ్వంసంతో వాతావరణ మార్పులు

  • ఇటీవలి అమెరికా మంచు తుఫాన్లకు ఇవే  కారణాలు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న పర్యావరణవేత్తలు

న్యూదిల్లీ,జనవరి3 : వాతావరణ మార్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంటున్నాయి. అతిగా మంచు కురవడం, అతిగా శీతల గాలులు, అతిగా ఎండలు మనం చూస్తున్నాం. పర్యవారణ విధ్వంసంతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. దీనిపై ప్యారిస్‌ ‌చర్చలు అమలు చేసేందుకు ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇటీవల తీవ్రమైన శీతాకాలపు తుఫాను గుప్పిట్లో ఉత్తర అమెరికా, కెనడాలు అతలాకుతలం అవుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదంతా కూడా పర్యావరణ విధ్వంసం కారణంగా జరిగిన పరిణామంగా గుర్తించాలి. మనదేశంలోనూ కొండలను,గుట్టలను తొలిచేస్తున్నాం. అడవులను నరికివేస్తున్నాం. ఇవన్నీ కూడా మనతరాన్నే కాదు ముందు తరాన్ని దెబ్బతీస్తాయని గుర్తించడం లేదు. ఇప్పటికే ఉత్తర అమెరికా, కెనడాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుపాన్‌లతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. ఎపికిచెందిన ముగ్గురు మృత్యువాత కూడా పడ్డారు.

అక్కడ మరో 70-80 మంది మరణించి నట్లుగా వార్తలు వచ్చాయి. అడుగుల కొద్ది పేరుకు పోయిన మంచు గుట్టలతో ప్రజలు బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరగడంతో వేలాదిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అడుగు లోతుల్లో కార్లు కూరుకు పోవడం, కార్లలోనే వ్యక్తులు శవాలుగా మారడం, విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో లాంటి వార్తలు హృదయవిదారక వార్తలు ప్రసారం అయ్యాయి.  వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇది ’బాంబ్‌ ‌సైక్లోన్‌’‌గా మారి అమెరికాను వణఙకించింది.  పుల రాష్టాల్ల్రో  హిమపాతం ప్రమాదకరంగా మారిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఉష్ణోగ్రతలు మైనస్‌ 57 ‌డిగ్రీల సెల్సియస్‌ ‌వరకు పడిపోయయి.  రహదారులను క్లీయర్‌ ‌చేసే క్రమంలో మంచు గుట్టల్ని తొలగించే ప్రయత్నాలు చేసినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. చలి తీవ్రతకు మరిగే నీరు కూడా క్షణాల్లో గడ్డకట్టి పోయింది.

ఈ  వాతావరణ విపత్తుకు కారణాలుగా శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాలు, భూతాపం, పర్యావరణ కాలుష్యాలు వంటి అంశాలను పేర్కొంటున్నారు. అమెరికాను ముంచెత్తిన ఈ మంచు తుఫాను ఫలితంగా 20 లక్షల గృహాలు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీనిని అమెరికా, కెనడా దేశాల చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా అభివర్ణిస్తున్నారు. ఇదంతా కూడా మానవ తప్పిదంగానే చూడాలి. మనం చేస్తున్న ప్రకృతి విధ్వంసం కారణంగా జరుగుతన్న విపరీత పరిణామాలుగా చూడాలి.పర్యావరణ విధ్వంసం మానవ ఉనికిని దెబ్బతీస్తుందని గుర్తించాలి.

Leave a Reply