- మాస్క్‌లతో పది పరీక్షలకు విద్యార్థులు
- తొలి రోజు 17,909 మంది విద్యార్థులకు 17,851హజరు
- 58 మంది గైర్హాజర్ 99.68 శాతం నమోదు
ఖమ్మం :పదవ తరగతి పరీక్షలు గురువారం తొలిరోజు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాలలో 17,909 మంది విద్యార్థులకు గానూ 17,851 మంది విద్యార్థులు హజరుకాగా 58 మంది గైర్హాజయ్యారు.దీంతో 99.68 శాతం హజరు నమోదైంది. ఖమ్మం జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటలకే విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఏడాది పాటు కష్ట పడి చదివిని విద్యార్థులు తొలిరోజు పరీక్షకు హజరయ్యేందుకు ఉదయమే లేచి దేవతలకు ప్రార్థనలు చేసి ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకుని పరీక్షలకు బయలే దేరి వెళ్ళారు. విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 8 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అధికారులు వచ్చిన వారందరిని కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మాస్క్‌లు ధరించి వచ్చారు.
ఉదయం 9.30 గంటల నుంచి 12;15 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే విద్యార్థులను కేంద్రాలలో క్షణంగా తనిఖి చేసి లోనికి అనుమతించారు. పరీక్ష సమయంలో మాస్క్‌లను అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో పరీక్షలు ప్రశాంత వాతా వర ణంలో జరగడంతో అధికారులు ఊపిరి పిల్చు కున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందో బస్తూ నిర్వహించారు. కేంద్రాల సమీపం లో 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా విద్యాశా ఖాధికారి మదన్మోహన్ రిక్కా బజార్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అలాగే స్క్వాడ్స్ 34 కేంద్రాలలో అకస్మిక తనికిలు చేశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సిబ్బందికి శానిటైజర్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతు న్నాయని డీఈవో మదన్మోహన్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారనిఆయన పేర్కొన్నారు.
మధిరలో…
మధిర, మార్చి 19 (ప్రజాతంత్ర) : ఈ నెల 19 నుండి ఏప్రిల్ 1వ జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మధిర మండలంలో గురువారం ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమ య్యాయి. పట్టణంలోని టివిఎం హైస్కూల్, సిపిఎస్, హరిజనవాడ హైస్కూల్, బాలికల ఉన్నత పాఠశాల, సిరిపురం హైస్కూల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా మండలంలోని మొత్తం 974మంది విద్యార్థులకు గాను 973 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు ఎంఇఓ వై.ప్రభాకర్ తెలిపారు. కేవలం ఒక విద్యార్ధి మాత్రమే పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా గంట ముందు నుండే పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చినట్లు, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపా రు. విద్యార్ధులు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా రాయాలన్నారు.