కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లోని ఫిజికల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ‘‘మోడర్న్ క్యారెక్టరీజెషన్ టెక్నీక్స్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్’’ అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో భాగంగా గురువారం సెషన్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైద్రాబాద్‌కు చెందిన అంతర్జాతీయ అడ్వాన్సుడ్ రిసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ కొప్పోజు సురేష్ మాట్లాడుతూ ఎక్స్ రే డిఫ్రాక్టమెట్రి మూలాలు అత్యాధునిక ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలలో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ఆర్డి టెక్నిక్‌ను నోబుల్ లారేట్ రాంట్జెన్ కనుగొని 125 సవంత్సరాలు అయినప్పటికీ జీవ వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విరివిగా వాడుకలో ఉందన్నారు. ఇది సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో, నిజమైన ఫలితాలను నిక్కచ్చిగా తెలుపుతుందన్నారు. నానో సైన్స్, నానోటెక్నాలజీ, ఆటం ప్రోబ్ టొమోగ్రఫీ, కరోన వైరస్ పరిశోధన లలో కూడా వాడుతున్నామన్నారు. ప్రస్తుత ప్రధాన పరిశోధన సమస్యలు, సొల్యూషన్స్, కాన్సెప్టస్, సునాయాస పరిష్కారాల గూర్చి సాంకేతికంగా వివరించారు. ఈ అత్యాధునిక శాస్త్ర పరిశోధనలు సాంకేతిక క్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుల్లో బోధన సామర్ధ్యాన్ని పెంచేందుకు ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిజికల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఎఫ్డిపిని ఈనెల 4నుండి 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ టి.మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్స్‌రే ఫోటో ఎలెక్ట్రాన్ స్పెక్టరోస్కోపి, లేజర్ స్పెక్టరోస్కోపి, అయాన్ భీమ్ కారెక్టరైజేషన్ టెక్నీక్ మొదలగు వాటిపై ప్రత్యేక ఉపన్యాసాలు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె.శివ శంకర్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎన్.మారాము, ఉప కో-ఆర్డినెటర్లుగా డాక్టర్ ప్రశాంత్ కుమార్, డాక్టర్ కళ్యాణ్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు, డాక్టర్ కె.శ్రీనివాస్, అడ్వయిజరి మెంబర్లుగా అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ డి.ప్రభాకరాచారి, డాక్టర్ హెచ్.రమేష్ బాబు, డాక్టర్ సిహెచ్ సతీష్ చంద్ర, ఆర్గనైజర్లు, డీన్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, రెండు వందల మంది అధ్యాపకులు దేశంలోని వివిధ కళాశాల నుండి పాల్గొన్నారు.