Take a fresh look at your lifestyle.

పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి

వనపర్తి,జూన్‌,03(‌ప్రజాతంత్ర విలేకరి) : ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇంటితోపాటు పరసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దేవరకద్ర శాసనసభ్యు లు ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కొత్తకోట మండలం పాలెం, రామానంతాపూర్‌ ‌గ్రామాలలో కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాషతో కలిసి ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం లో పాల్గొన్నారు. ముందుగా రెండు గ్రామా)లో ఇళ్లను సందర్శించి ఇళ్లలో నిలువ నీటిని బయట పారబో యించారు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని అందువల్ల గ్రామాల ప్రజలు నీటిని నిల్వ ఉంచుకోవద్దని అంతేకాక పాత సామాన్లను పారవేయలని సూచించారు. రెండు గ్రామాలో గ్రామ పంచా యతీల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డుతు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వారి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఇంట్లో మరుగు దొడ్డితో పాటు ఇంకుడు గుంతలను వందకు వందశాతం నిర్మించుకోవాలని అన్నారు. పరిశుభ్రతతో పాటు కరోనా పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలని ఇంకా ఇప్పటివరకు కరోనా కు మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం చేతులు శు్ర•ంగా కడుక్కోవడం వంటివి చేయాలని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని ముఖ్యంగా కరోనా సమయంలో కూడా రూ.30 వేల కోట్లను వెచ్చించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిందని నియం త్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా పంటలు పండించు కునేందుకు సూచనలు సలహాలు ఇస్తున్నారని రైతులు ఈ వానకాలంలో మొక్కజొన్న వేయవద్దని సన్నరకం వడ్లు వేయాలని డిమాండ్‌ ఉన్నట్లు సాగు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ ‌షేక్‌ ‌యాస్మిన్‌ ‌బాష మాట్లాడుతు రెండు నిడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినప్పటికి గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా వర్షాకా లంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా మురికి కాలవలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. కరోనా పట్ల ప్రజలు పూర్తి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం సామాజిక దూరం పాటించాలని అవసరముంటేనే బయటకు రావాలని మురికి కాలువలు శుభ్రం తో పాటు వైకుంఠధామం చెత్త వేరుచేసే షెడ్డులుపై దృష్టి సారించాలని ఆమె సూచించారు. అనంతరం కలెక్టర్‌ ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ చెక్కులను 47మందికి పంపిణి చేశా రు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మెన్‌ ‌వామన్‌గౌడ్‌, ఎం‌పిపి గుంతా మౌనిక, స్థానిక సర్పంచులు పంచాయతీ అధికారి రాజేశ్వరి, డిఆర్వో గణేష్‌, ‌జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!