Take a fresh look at your lifestyle.

సవరణల పేరిట అటవీ చట్టానికి తూట్లు

“మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతున్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే భూతాపం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈ సృష్టిలో గల ప్రతీ జీవి అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి.దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది.అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయువును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి.ఫలితంగా పర్యావరణం కాలుష్య భరితం అవుతూ ఉంది.మానవుని స్వార్థపూరిత చర్యలు వల్లనే ఈ అడవులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా  తరిగిపోతున్నాయి అనేది నిర్వివాదాంశం”

భూతాపం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోవడానికి సహజసిద్ధమైన అత్యుత్తమ పరిష్కారం అడవుల పరిరక్షణ.మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతున్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే భూతాపం వలన ఏర్పడే ప్రమాదాన్ని ఈ సృష్టిలో గల ప్రతీ జీవి అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి.దీనిని దృష్టిలో ఉంచుకునే మన దేశం కూడా ఎన్నో అంతర్జాతీయ సదస్సులలో తీర్మానాలు చేసుకుంటూ హామీలు ఇస్తూ వస్తున్నది.అయితే ఎన్ని సదస్సులు జరిగిన తీర్మానాలు చేసినా వాస్తవంలో మాత్రం భూతాపాన్ని తగ్గించి ప్రాణ వాయువును అందించే అడవులు మాత్రం క్రమేపీ క్షీణిస్తూనే ఉన్నాయి.ఫలితంగా పర్యావరణం కాలుష్య భరితం అవుతూ ఉంది.మానవుని స్వార్థపూరిత చర్యలు వల్లనే ఈ అడవులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా తరిగిపోతున్నాయి అనేది నిర్వివాదాంశం.

వంట చెరకు, కలప స్మగ్లింగ్‌, ‌చెట్ల నరికివేత, పట్టణీకరణ, ఆక్రమణ, అటవీ భూములు వ్యవసాయ భూములుగా మార్పు, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యకలాపాల వలన అరణ్యాలు నానాటికీ కుదించుకుపోతున్నాయి.బ్రిటీష్‌ ‌వారి కాలంలోనే ఈ అటవీ పరిరక్షణకై మన దేశంలో 1927వ సంలో అటవీ చట్టం పురుడు పోసుకోవడం జరిగింది.దాని కొనసాగింపుగా మనదేశంలో 1980 వ సంలో అడవుల పరిరక్షణకై పటిష్ట చట్టాన్ని రూపొందించాం. ఎట్టి పరిస్ధితులలో కూడా అడవులను ఆటవీయేతర ఉత్పత్తి కార్యక్రమాలకు ఉపయోగించకూడదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నాం.1988 మరియు 1996 వ సంలో ఈ చట్టానికి సవరణలు తీసుకు వచ్చి అటవీ భూముల పరిరక్షణకు మరింత రక్షణ కల్పించాం. అయితే ఆ స్ఫూర్తి వాస్తవంలో మాత్రం కనపడటం లేదు అనడానికి ప్రతీ ఏటా మన దేశంలో క్షీణిస్తున్న అడవులే ప్రధాన సాక్ష్యం.సవరణ చట్టంలో 1927 నాటికి వేటిని అడవులుగా నిర్వచించామో వాటినే ప్రస్తుతం అడవులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్దారించడానికి సిద్ధం అయ్యింది. ప్రయివేట్‌ ‌భూముల విషయంలో నెలకొన్న అడవుల విషయంలో మినహాయింపు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అటవీ ఆస్తులకు సంబందించి ఒక కేసు విచారణలో మాత్రం అటవీ చట్టం దశ దిశ మార్చే తీర్పును ప్రకటించింది.అది ఏమిటంటే అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా… ఏ ప్రాజెక్టు – కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవే, పైన చెప్పినవి అన్నీ కూడా సదరు చట్ట పరిధిలోకే వస్తాయి. అలాంటి ఏ భూమి వినియోగ మార్పిడికైనా అనుమతులు తప్పనిసరి అని తీర్పులో పేర్కొంది.ఈ తీర్పు ఫలితంగా భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చదనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి.దీనివలన పచ్చదనం కొంతవరకు పెరిగింది అనడంలో సందేహం లేదు.పర్యావరణ వేత్తలకు ఇది శుభవార్తగా నిలిచింది.

అయితే ప్రభుత్వాలకు మాత్రం ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే ఈ తీర్పు ద్వారా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు మరింత కఠినమై అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్ధితిని గమనించిన ప్రభుత్వాలు ఆ చట్ట పరిధి నుండి బయట పడే మార్గాలపై అన్వేషించడం మొదలు పెట్టాయి.చట్టాన్ని నీరు గార్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టాయి.దీనికై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత అటవీ చట్టానికి కొత్తగా సవరణలు చేపట్టి అటవీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి.దీనిని ఆచరణలోకి తీసుకురావడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం 1988 అటవీ సంరక్షణ చట్టంలో కొన్ని సవరణలను చేయడానికి సిద్ధం అయ్యింది. దీనిని అమలు పరచే బాధ్యత తీసుకోవడానికి కేంద్ర పర్యావరణ, అటవీ సంరక్షణ మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఒక పత్రం ద్వారా ప్రతి పాదన చేసి ప్రజల మరియు పర్యావరణ వేత్తల అభ్యంతరాలు ఉంటే అక్టోబర్‌ ‌నెలాఖరు లోగా తెలియ చేయాలని ప్రకటించడం జరిగింది. మారుతున్న ఆర్ధిక అవసరాలు దృష్టి లో ఉంచుకుని ప్రస్తుత అటవీ చట్టానికి సవరణలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు..ఈ విషయమై కేంద్రం అటవీ చట్ట సవరణ చేయడానికి 14 అంశాలను ప్రతిపాదించారు.ఈ సవరణల ప్రధాన లక్ష్యం ఇప్పటి వరకు రక్షిత అటవీ చట్టాల పరిధిలో ఉన్న భూములను ఆ చట్ట పరిధినుంచి తప్పించి అనుమతుల ఇబ్బంది లేకుండ చేసుకోవడం. ఎందుకంటే జాతీయ రహదారులు,రైల్వే రవాణా, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అటవీ చట్ట పరిధిలో ఉండే భూముల నుండి మరియు పర్యావరణ అనుమతులు రావడం చాలా క్లిష్టతరం అవుతూ ఉంది.దానితో పాటు వాటి నిర్మాణ వ్యయాలు కూడా రోజు రోజుకి పెరిగిపోయి అభివృద్ధి పనులు నిలచి పోతున్నాయని ప్రభుత్వ వాదన.దానిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అటవీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలు మొదలు పెట్టింది.దీనికి దేశ భద్రత.. దేశ రక్షణ అనే అంశాలను ముడి పెట్టి సవరణ ప్రతిపాదన చేసింది.దాని ప్రకారం దేశ సరిహద్దులు వెంబడి అవస్ధాపన వసతులు కల్పించడానికి నిర్దేశిత ప్రాజెక్టులు చేపట్టడానికి అటవీ మరియు పర్యావరణ అనుమతులు ఆటంకం కలిగిస్తున్నాయి ఇటువంటి వాటిలో జాప్యం అనేది సరి హద్దు దేశాల నుండి ముప్పుకు అవకాశం కలిగిస్తుంది.కనుక అటువంటి వాటి కోసం ఆ ఆభూములను చట్ట పరిధి నుండి మినహాయించాలి అనే ప్రతిపాదన ఒకటి.దేశ భద్రత దృష్ట్యా ప్రజల నుండి రాజకీయ పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదని దీనిని ప్రధానంగా ప్రభుత్వం చూపించింది.

అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత – వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే అనుమతులు అక్కర్లేదు అనేది ఈ సవరణ ప్రధాన లక్ష్యం.ఇకపోతే దీనికి అనుబంధంగా రైల్వేలు, హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని అటవీ చట్టం నుండి మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్‌ ‌పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస – ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మా ణాలు అనుమతించడం, స్థలయాజమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ – రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు ఆ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం వంటి వాటిని సవరణలుగా ప్రతిపాదిస్తూ అటవీ చట్టాన్ని నీరు గార్చడానికి రంగం సిద్ధం అయ్యింది.అంతకన్నా ముఖ్యంగా చమురు సహజవాయువు వెలికి తీతలో నేడు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానం ఎం తగానో లభి ంచింది. దానిని ఉపయోగించుకుని అడవులకు నష్టం కలగకుండా అడవుల వెలుపల భూమికి రంధ్రాలు చేసి వాటి ద్వారా అడవులలో చమురు సహజ వాయువల అన్వేషణ చేసుకునే అవకాశం పొందటానికి చట్ట సవరణ అవసరం అని ప్రభుత్వం భావిస్తూ ఉంది ప్రభుత్వం.ఇలా లభించిన భూమి అంతా అటవీయేతర అవసరాలకు వినియోగించాలి అన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం..ఒక విధంగా చూస్తే ఈ చట్టానికి సవరణలు లేకుండానే ప్రతీ యేటా మన దేశం సమారు 13 వేల చ.కి.మీ. అటవీ భూమిని కోల్పోతోంది అని ఒక అంచనా. ప్ర స్తుతం మన దేశంలో సు మా రు ఆరు కోట్ల 49 లక్షల హె క్టార్ల భూమి మాత్రమే అటవీ ప్రాంతం కింద ఉన్నట్లు గణా ంకలు చెబుతున్నాయి.ఈ సవరణ చట్టం కానీ అమలులోనికి వస్తే మరింత అటవీ భూభాగం హరించుకు పోతుంది అనడంలో సందేహం లేదు. జాతీయ స్ఫూర్తిని దృష్టి లో ఉంచుకుని చట్టానికి కొన్ని సవరణలు చేసి మినహాయింపులు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉన్నా ఆచరణలో ఈ సవరణలు కార్పొరేట్‌ ‌వర్గాల వారి ప్రయోజనాలకే అన్నది వాస్తవం.ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మానిటైజేషన్‌ ‌లో భాగంగా రోడ్డు, రైల్వే, అవస్ధాపన సౌకర్యాల కల్పన ఏర్పాటు అనేవి పూర్తిగా కార్పొరేట్‌ ‌వర్గాల చేతుల్లోనికి వెడతాయి.దీనితో పాటు దేశ వ్యాప్తంగా అవస్ధాపన సౌకర్యాల కోసం లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం పీ.ఎం.గతి శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ పనులు కూడా కార్పొరేట్‌ ‌వర్గాల వారికే దక్కుతాయి.అయితే వీటి ఏర్పాటులో వారికి పర్యావరణ అనుమతుల ఇబ్బందులు లేకుండా చేయడానికే ప్రభుత్వం అటవీ చట్టానికి సవరణలు చేయడానికి ముందుకు వచ్చింది అని పర్యావరణ వేత్తల అభిప్రాయం.

ఈ సందర్భంలో ప్రస్తుత అటవీ చట్టం ద్వారా వారికి పర్యావరణ అనుమతులు పొందడం కష్టం అవుతాయి.ఈ విషయంలో వారికి ఇబ్బంది కలిగించకుండా సానుకూలత కలుగ చేయటానికే ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టడానికి సిద్ధం అయ్యింది అని పర్యావరణ వేత్తల అభి ప్రాయం.కేవలం వారి ప్రయోజనాల కోసం అటవీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం సమంజసం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అటవీ చట్టాలకు ఇన్ని మినహాయింపులు ఇస్తూ కూడా అడవులను 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 22 శాతం అడవులు కూడా ఈ మినహాయింపుల పర్వం ద్వారా మరింత అడవుల విస్తీర్ణం అంతరించి పోవడం తధ్యం. దేశ సరిహద్దులు లో అత్యంత ఆవశ్యకమైన రక్షణ భద్రతలు కోసం మినహాయింపు కోరడంలో తప్పు లేదు.వాటిని ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. అయితే ఇటువంటి దేశ భద్రత అనే అంశాన్ని చూపించి భవిష్యత్‌ ‌లో మరెన్నో మినహాయింపులు చేసుకుంటూ పోతే రక్షిత అటవీ చట్టం నిర్వీర్యం కాక తప్పదు ఆ దిశగానే ప్రభుత్వాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి కూడా.తప్పనిసరి పరిస్ధితులలో అటవీ భూములను ఉపయోగిస్తే అదే పరిమాణంలో అడవులు పెంచాలి అనేది చట్ట నియమం..కానీ మనం నరుకుతూ పోవడమే తప్ప పెంచిన దాఖలాల పై శ్రద్ధ చూపడం లేదు.ఎందుకంటే ఏడు దశాబ్దాల పైగా మనం వన సంరక్షణ ధ్యేయంగా వన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం కానీ ఈ కృషితో అటవీ విస్తీర్ణాన్ని ఏమాత్రం పెంచలేక పోయాం అనేది మాత్రం కఠిన సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పచ్చదనం విషయంలో స్వచ్చంద సంస్ధలు స్దానిక ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాయి.మొత్తం మీద ఈ అటవీ చట్ట సవరణ ఫలాలు అన్నీ కార్పొరేట్‌ ‌సంస్థలకు మేలు చేసేవే! కొత్త అడవుల పెంపకం పక్కన పెడితే ఇటువంటి సవరణలు వలన ఉన్న అడవికి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతిపాదించిన అటవీ చట్ట సవరణలను పర్యావరణ వేత్తలు..స్వచ్చంద సంస్ధలు పౌరులు ఖండించవలసిన సమయం ఆసన్నమయ్యింది.ఈ విషయమై మన మౌనంగా ఉంటే అది భావి తరాల వారికి శాపంగా పరిణమిస్తుంది.అడవులు లేకపోతే ప్రకృతి సమతుల్యం ఉండదనే సత్యాన్ని గ్రహించి అటవీ వినాశనాన్ని అరికట్టగలిగిన రోజే మనంకరవులు, అధిక ఉష్ణోగ్రతలు, భూతాపాలు, కాలుష్యాల నుండి బయపడతాం. ఎన్నో జీవరాసుల ఆవరణాలను కాపాడిన వాళ్ళం అవుతాం.

– రుద్రరాజు శ్రీనివాసరాజు.9441239578.
లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్..ఐ.‌పోలవరం.

Leave a Reply