Take a fresh look at your lifestyle.

సివిల్స్ ‌ప్రలిమ్స్ ‌వాయిదా కుదరదు

‘సుప్రీమ్‌’‌కు తేల్చి చెప్పిన యూపిపిఎస్సీ…విచారణ రేపటికి వాయిదా
వచ్చే నెల 4న జరగాల్సిన సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌పరీక్షను వాయిదావేసే అవకాశం లేదని సుప్రీమ్‌కోర్టుకు యూపీఎస్సీ తెలిపింది. కొరోనా నేపథ్యంలో సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌పరీక్షను వాయిదావేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీమ్‌కోర్టు సోమవారం విచారణ చేప్టింది. ఈ సందర్భంగా పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని యూపీఎస్సీ తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అయితే వాయిదా వేయలేకపోవడానికి కారణాలు తెలపాలని, దానికి సంబంధించి మంగళవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని జస్టిస్‌ ‌ఖాన్విల్కర్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది.

తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేసింది. షెడ్యూల్‌ ‌ప్రకారం యూపీఎస్సీ సివిల్స్ ‌ప్రిలిమ్స్ ‌పరీక్ష అక్టోబర్‌ 4‌న జరగాల్సి ఉన్నది. అయితే దేశంలో కొరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో పరీక్షను రెండు నుంచి మూడు నెలలపాటు వాయిదా వేయాలని 20 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. కాగా, కొరోనా మహమ్మారిని నిలువరించడానికి దేశంలో లాక్‌డౌన్‌ ‌విధించడంతో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ ‌పరీక్ష వాయిదాపడింది. అనంతరం జూన్‌ 6‌న పరీక్షల తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 4‌న ప్రిలిమ్స్ ‌జరుగుతుందని వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply