Take a fresh look at your lifestyle.

పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొ .శేషయ్య కన్నుమూత

సంతాపం తెలిపిన హెచ్ఆర్ఎఫ్ ,సీపీఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ 
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం  రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు   ప్రొఫెసర్ శేషయ్య  శనివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకి హైదరాబాదులో కోవిడ్ 19 తో మరణించారు. అనంతపురం లో ఆయన కొంత కాలం వైద్యం చేయించుకున్నారు. అక్కడి డాక్టర్ల సలహా పై హైదరాబాద్ లోని ఆసియన్ ఇన్స్టిట్యూట్   ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ లో వైద్యం చేయించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల లోనూ హక్కుల ఉద్యమ కార్యకర్తలకి  శేషయ్య చిరపరిచితులు.   శేషయ్య మరణం తో హక్కుల ఉద్యమం మంచి కార్యకర్తను కోల్పోయిందనీ.. శేషయ్య కుటుంబ సభ్యులకీ, వారి సహచర కార్యకర్తలకు మానవ హక్కుల వేదిక (HRF)   ఎస్. జీవన్ కుమార్   వేమన వసంత లక్ష్మి ,మానవ హక్కుల వేదిక  రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు మరియు అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు , ప్రధాన కార్యదర్శి  డా. ఎస్. తిరుపతయ్య సంతాపం తెలిపారు.ఏపీ సీ ఎల్సీ  అధ్యక్షుడిగా  పని చేసిన కామ్రేడ్ శేషయ్య కోవిడ్  తో మరణించడం బాధాకరం..   ఆయన ప్రజల తరుపున నిలబడ్డారు..వారి హక్కుల కోసం పోరాడారు.ఎన్కౌంటర్స్ కు వ్యతిరేకంగా పోరాడారు.. ఏపీసీఎల్సీ ని  ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు తీవ్ర యత్నం చేశారని ..ఆయన కుటుంబానికి,ఆయన హక్కుల ఉద్యమ సహచరులకు సీపీ ఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ   కార్యదర్శి.   డివి కృష్ణ  సహాయ కార్యదర్శి పోటు రంగారావు సంతాపం ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply