Take a fresh look at your lifestyle.

కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌తో.. నగరం, రాష్ట్రం మరింత సురక్షితం

  • రెండుమూడు నెలల్లో అందుబాటులోకి
  • నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్‌

‌కమాండ్‌ ‌కంట్రోల్‌తో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం తెలుసుకునే వీలుంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. అలాగే సహాయ చర్యలు కూడా వేగవంతం చేసే వీలుంటుందన్నారు. హైదరాబాద్‌ ‌మహానగరాన్ని, మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన, అత్యంత భద్రమైనదిగా తీర్చి దిద్దుతున్నట్లు తెలిపారు. ఒక విజన్‌తో భారత్‌లో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయస్థాయిలో సైతం వేళ్ల వి•ద లెక్కపెట్టేగలిగేలా ఉన్న ఈ అద్భుతమైన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను అందుబాటులోకి తీసుకుని వొస్తున్నట్లు కెటిఆర్‌ ‌తెలిపారు. నగరంలోని బంజారాహిల్స్ ‌రోడ్‌నెంబర్‌ 12‌లో నిర్మిస్తున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తవుతుందని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు.

ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్‌ ‌నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ ‌మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ..అందరం కలిసి సందర్శించి ఇక్కడి విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. దాదాపుగా 90 శాతం పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మరొక రెండు, మూడు నెలల్లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply