ఇష్టానుసారం రోడ్ల మీదకు రావడం తగదు
తప్పుడు పత్రాలతో తిరిగితే కేసులు పెడతాం
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరిక
నగర ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు. కొరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించాలన్నారు. అప్పుడే మనం ఈ మహమ్మారిని తిప్పికొట్టగలమన్నారు. ఇకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డువి•దకు రావడం తగదన్నారు. తప్పుడు పత్రాలతో రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. నగరంలో లాక్డౌన్ అమలు తీరును సీపీ శుక్రవరాం పరిశీలించారు. ఇందులో భాగంగా దిల్సుఖ్నగర్ చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో మినహాయింపులు పొందినవారికే తనుమతిస్తామని చెప్పారు. అత్యవసరమైన వారికి ఈ-పాస్‌లు అందిస్తున్నామని అన్నారు.
ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే వాహనాల్ని సీజ్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కాలనీలు, అంతర్గత రహదారుల్లో పోలీసు నిఘా విస్తృతం చేయాలని సూచించారు. లాక్డౌన్ ఉల్లంఘించి తిరిగే వాహనాల జప్తు చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో 180 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను పరిశీలించినట్లు చెప్పారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా చేకింగ్స్ నిర్వహిస్తున్నారని… ఆయ చెక్‌పోస్ట్‌ల వద్ద నిన్నటి నుండి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూనే ఉందని తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలు సీజ్ చేస్తామని…తమ సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 65కు పైగా వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకూడదన్నారు.
ఎమర్జెన్సీ, మెడికల్, మెడిసిన్, హాస్పిటల్ వెళ్ళే వారిని, ఎసెన్షియల్ సర్వీసెస్ అనుమతిస్తున్నారని తెలిపారు. టైమ్ పాస్ కోసం పాసులు వెంట తెచ్చుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. ఇదిలావుంటే లాక్డౌన్ సమయంలో నకిలీ పాస్‌లతో బయటకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పలు వాహనాలను ఆపి పత్రాలు, గుర్తింపు కార్డు, పాస్‌లను పరిశీలించారు.
లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. గల్లీల్లో ఎవరైనా షాపులు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీపాస్లతో తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.