Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్య సిబ్బంది సమయపాలన పాటించాలి

కార్మికుల మస్టర్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్‌ ‌వసీం
అనంతపురం,జూన్‌ 24 : ‌సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి నగర మేయర్‌ ‌మహమ్మద్‌ ‌వసీం సూచించారు. నగరంలోని మొదటి, ఐదో సర్కిల్‌ ‌పారిశుద్ధ్య సర్కిల్‌ ‌కార్యాలయంలో గురువారం తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికుల మస్టర్‌ ‌ను మేయర్‌ ‌వసీం ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా కార్మికులు, మేస్త్రీలు,శ్యానిటరి సెక్రెటరీల అటెండెన్స్ ‌ను పరిశీలించారు. అనేక మంది ఆలస్యంగా విధులకు హాజరు కావడంతో సమయ పాలన పాటించకుంటే ఎలా అని ప్రశ్నించారు. కార్మికుల రక్షణ కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్‌ ‌వసీం పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి కార్మికులు ఇందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. తప్పనిసరిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఎదో వచ్చాము వెళ్ళాము అంటే కుదరదని అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను మేయర్‌ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ ‌రాజేష్‌, ‌కార్పొరేటర్‌ అనీల్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply