Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో నేటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

25 శాతం నడిపేందుకు ప్రభుత్వం ఆమోదం
గ్రేటర్‌ ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం
కర్నాటక, మహారాష్ట్రలకు కూడా నేటి నుంచి ప్రారంభం

‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో  సిటీ బస్సుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి గ్రేటర్‌లో బస్సులను నడిపేందుకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈమేరకు గురువారం గ్రేటర్‌ ‌పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్‌ అం‌గీకరించారు. లాక్‌డౌన్‌ ‌మార్గదర్శకాలను పాటిస్తూ 25 శాతం సర్వీసులు నడపాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా గత మార్చి నుంచి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆరు నెలల విరామం తరువాత నగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేయనుంది. అలాగే, మార్చి నుంచి నిలిచిపోయిన మహారాష్ట్ర, కర్నాటక బస్సులు కూడా నడిపేందుకు సీఎం కేసీఆర్‌ అం‌గీకరించారు.

ఈమేరకు గురువారం రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఏపీకి బస్సు సర్వీసుల నిర్వహణపై ప్రబుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. కాగా, శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సుల నిర్వహణకు సీఎం కేసీఆర్‌ ‌గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో నగరంలో ఎక్కడెక్కడ బస్సులను నడిపించాలనే అంశంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌సంబంధిత అధికారులతో మాట్లాడారు. దీనికి సంబంధించి అన్ని డిపోల అధికారులను సమాయత్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేకు కోవిడ్‌ 19 ‌నిబంధనలను పాటిస్తూ శుక్రవారం నుంచి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 25 శాతం సిటీ బస్సులను నడిపేందుకు నిర్ణయించామనీ, అలాగే, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు సైతం ఆర్టీసీ సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ ‌వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply