Take a fresh look at your lifestyle.

‌ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలి

  • కొరోనా మహమ్మారి నిర్మూలనకు కృషి చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్: ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించి కొరోనా మహమ్మారి నిర్మూలనకు కృషిచేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్‌ ‌కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్పీలతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు పాటించి కొరోనా మహమ్మారిని పారదోలేందుకు కృషిచేయాలని తెలిపారు. ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి నుండి ఒక మీటర్‌ ‌దూరాన్ని పాటించాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దేవుని దయ వల్ల వికారాబాద్‌ ‌జిల్లాలో ఇక ముందు ఎటువంటి పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాకూడదని, మనం అందరం ఆ భగవంతున్ని ప్రార్థన చేద్దాం అని కోరారు. జిల్లాలో ఎలాంటి కొరొనా కేసులు నమోదు కాకూడదంటే ప్రజల సహకారం ప్రజాప్రతినిధులకు, అధికారులకు కావాలని తెలిపారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యం వడ్లు, కందులు, శనగలు, జొన్నలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పూలు కూడా ప్రభుత్వమే నేరుగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌కు సూచించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

అధికారులందరూ నిరంతరం కొరోనా వ్యాప్తి చెందకుండా శ్రమించారని అన్ని శాఖల అధికారులను అభినందించారు. కొరోనా పూర్తిగా నశించేటట్లుగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్లతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో లక్ష ఇరవై నాలుగు వేల మంది కూలీలు పనిచేస్తున్నారని వారందరూ కూడా కొరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని ఎనభై శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిందని తెలిపారు. రైతులు వర్షాలు పడక ముందే ఎరువులను కొనుగోలు చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాబోయే వర్షాకాలంలో ధాన్యపు నిలువలను కమ్యూనిటీ హాల్‌ ‌నందు కానీ గవర్నమెంట్‌ ‌స్కూళ్లలో కాని భద్రపరచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఒక అర ఎకరం భూమిని గుర్తించి రైతు వేదికలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. లాక్డౌన్‌ ‌వల్ల విపరీతమైన నష్టం వాటిల్లిందని, అయినప్పటికీ రైతు బీమా పథకం కింద ఒక రైతు చనిపోతే వారం రోజులలోగా రైతు ఖాతాలో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వమే జమ చేసిందని తెలిపారు. బిహార్‌ ‌రాష్ట్రం నుండి వచ్చిన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో వారివారి రాష్ట్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ గ్రూపుల్లో ఉన్న మహిళలకు పాత బకాయిలతో సంబంధం లేకుండా యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు లోన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటర్‌ ‌మీడియట్‌ ‌వ్యాలుయేషన్‌ ఈ ‌నెల పన్నెండు నుండి ప్రారంభమైనట్లు తెలిపారు. అనంతరం వికారాబాద్‌ ‌జిల్లా నూతన కలెక్టరేట్‌ ‌కార్యాలయపు భవన సముదాయా నిర్మాణపు పనులను ఆమె పరిశీలించారు. అక్కడ పనిచేసే కాంట్రాక్టర్‌ ‌వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ ‌తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ ‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, పరిగి ఎమ్మెల్యే మహేష్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పౌసమి బసు, ఎస్పీ నారాయణ, మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రమేష్‌, ‌వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply