Take a fresh look at your lifestyle.

కొరోనా జాగ్రత్తలతో తెరుచుకున్న సినీ థియేటర్లు

కొత్త సినిమాలకూ స్వల్పంగానే ప్రేక్షకులు
కొరోనా సెకండ్‌ ‌వేవ్‌తో విజృంభించడంతో మూతపడ్డ సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. కొన్ని సినిమాలు కూడా విడుదల కావడంతో కొద్ది సంఖ్యలో ప్రజలు థియేటర్లకు వచ్చారు. అయితే గతంలో లాగా కాకుండా ఆచితూచి వొచ్చారు. తొలిరోజు స్పందన అంతంత మాత్రంగానే ఉందని థియేటర్ల యజమానులు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాల కోసం కొందరు థియేటర్లకు వొచ్చారు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. కొరోనా కారణంగా నగరంతో పాటు అనేక పట్టణాల్లో థియేటర్లలో ప్రదర్శన నిలిపివేసి రెండు నెలలకు పైన అవుతుంది.

సుదీర్ఘ విరామం తర్వాత నగరంలో తిరిగి థియేటర్లు తెరుచుకోవడంతో వందశాతం ఆక్యుపెన్సీతో సినిమాలను ప్రదర్శించనున్నారు. దీంతో పలు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నేడు పలు కొత్త సినిమాలు విడుదల నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌లోని థియేటర్లలో రద్దీగా ఉంది. సింగిల్‌ ‌స్క్రీన్‌ ‌థియేటర్లలో నేటి నుంచి పార్కింగ్‌ ‌చార్జీలు కూడా అమలుకానున్నాయి.

Leave a Reply