Take a fresh look at your lifestyle.

‘‘‌సుడొక చోట..సురకొక చోట…’’

“కొద్ది పాటి నష్టాలో లాభాలోఉన్నా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.. విశాఖ కర్మాగారంలో కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ మరికొన్ని వేల మంది పరోక్షంగానూ ఆధార పడి బ్రతుకుతున్నారు.కొత్త ఉద్యోగాలు ఎలాగూ కల్పించలేం. (2019 లో లక్షా నలభై వేల కోట్ల ఆదాయ పన్ను రాయితీ పొందిన బడా బాబులు ఏడాదిన్నర లోగా ఎన్నికొత్త సంస్థలు నెలకొల్పి ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో లెక్కలు తెలిస్తే మనం సంతోషించవచ్చు).”

ఇది ఉత్తరాంధ్ర సామెత. కొన్ని రకాల జబ్బులకి చుట్టకాల్చి సరైన చోట చురకపెడితే ఆ జబ్బు తగ్గిపోతుందనే ప్రజల విశ్వాసం. అలా తగ్గుతుందో తగ్గదోనన్న సంగతటుంచి ఆ సురకేదో పెట్టాల్సిన చోటే పెట్టవలసిన అవసరమైతే ఉంది కదా? అలా కాకుండా వేరే చోట పెడితే ఒళ్లు కాలడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు కదా? ఏదైనా జబ్బు తగ్గాలంటే సరైన వ్యాథి నిర్ణయం సరైన చికిత్స(మందులు) అవసరమౌతాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం పని చేయదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందువల్ల మేమేదో ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదనే నిర్ణయం తీసేసుకున్నాం కనుక ఇప్పటికే ఉన్న ప్రభుత్వ కర్మాగారాల్ని ఏదో పేరు పెట్టి అమ్మేస్తాం అనడం సరైన పధ్ధతి కాదు.

ముందరో చిన్న కథ. కొన్నేళ్ళ క్రిందటి వరకూ నా దగ్గర కైనెటిక్‌ ‌హోండా స్కూటర్‌ ఉం‌డేది.1991 లో కొన్నది.దాని మీద అప్పట్లో ఖాళీగా ఉన్న హైదరాబాదు రోడ్ల మీద వెళ్తుంటే రాజహంస మీద వెళ్తున్నట్లు ఉండేది. కొన్నేళ్లు వాడిన తర్వాత దానికేదో చిన్న రిపేరు వస్తే గ్యారేజ్‌ ‌కి తీసుకెళ్ళి బాగుచేయించుకున్నాను. అలా బాగుచేయుంచు కుంటున్నప్పుడు ఆ గ్యారేజ్‌ ఓనరయిన మెకానిక్‌ ‌తో నా స్కూటర్‌ అప్పుడు అమ్మేస్తే ఎంతొస్తుందని అడిగాను. అతడు అలాంటి పిచ్చి ఆలోచన లేమీ పెట్టుకోకండి సార్‌. ‌దీనిలో ఉండేది ఇంపోర్టెడ్‌ ఇం‌జను. మనకి ఒంటికేమైనా వస్తే మందులేసుకుని బాగు చేయించుకుంటాం కదా? ఇదీ అంతే చిన్న రిపేరు వచ్చిందంటే అమ్మి పారేయడమేంటండీ? అని నన్ను వారించేడు. ఆ తర్వాత ఎంత కాలమో ఆ %మీశీశీ•వతీ% నాకు నమ్మకమైన సేవ చేసింది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట ఆ మెకానిక్‌ ‌నాకు చేసిన హితబోధ నాకు అయిన దానికీ కాని దానికీ వస్తువులను అమ్మేయకూడదనే జ్ఞానోదయాన్ని కలిగించింది.

ఇప్పుడు. ప్రభుత్వం వారు తాము ( ఏ కొన్నింటినో తప్ప)మిగిలిన ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకోవాలనే బలమైన నిర్ణయం తీసుకున్నా మని తెలియజేసారు. నిజానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతటి సహాయ సహకారాలు అందించినా పుంజుకోకుండా నష్టాలనే చవి చూస్తున్న సంస్థ లేవైనా ఉంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించి అమ్మకానికి పెట్టి మరి కొంత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తామని ప్రభుత్వం అంటే హర్షించని వారుండరు. కానీ గంప గుత్తగా అన్నిటినీ ఒకే గాటన కట్టేసి చిన్న చిన్న నష్టాలొస్తున్నా తిరిగి గాడిలో పెట్టడానికి అవకాశం ఉన్న కర్మాగారాల్నికూడా అమ్మ జూపడం సరైన నిర్ణయం కాజాలదు. అందు వలన గంప గుత్తగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ప్రభుత్వ రంగం లో ఇంక నడపడానికి వీల్లేని సంస్థలేవైనా ఉంటే విడిగా వాటిని అమ్మకానికి పెట్టినా ఎవ్వరూ ప్రభుత్వాన్ని తప్పు పట్టరు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి సహేతుకమైన కారణాలను ప్రభుత్వం చూపించడం లేదు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే వారైనా హేతువులను పేర్కొనడం లేదు.విశాఖ కర్మాగారానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన ధన సహాయం ఎంతో ఎవ్వరూ చెప్పడం లేదు.అలా ప్రభుత్వం ధన సాయం చేయక పోతే ప్రభుత్వం (అంటే మనం) నష్టపోయిందెక్కడ? ఎంత సేపూ వాటిలో కార్మికులు సరిగా పని చేయరు, అయినా వారికి ప్రైవేటు రంగంలో వారి కంటే జీతాలెక్కువ, మీది ఆఫీసర్లకు వారిపై నియంత్రణ ఉండదు, యూనియన్లు అన్నిటా అడ్డం పడుతుంటాయి వంటి కారణాలు చూపిస్తుంటారు. ఇవన్నీ అన్ని చోట్లా ఉండే నిజాలు కాకపోయినా చాలా వరకూ సందేహించనక్కర లేని నిజాలే. వీటికి తోడు వీటి ఆజమాయిషీలో ప్రభుత్వాల అక్కర్లేని జోక్యాన్ని కూడా కాదనలేం.

ఇటువంటి ఇబ్బందులన్నీ విశాఖ ఉక్కు కర్మాగారానికీ ఉన్నాయి. అయినా వాటన్నిటినీ అథిగమించి విశాఖ ఉక్కు కర్మాగారం చక్కని పనితీరు కనపరుస్తూ ఎన్నో సంవత్సరాలు లాభాల బాటలోనే పయనించింది. ఇప్పుడేదో కొంచెం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు చెబుతున్నారు .దానికి కారణాలు కూడా తెలుస్తూనే ఉన్నాయి . స్వంత గనులు లేకపోవడం వలన ముడి సరుకును భారీ మూల్యం చెల్లించి కొనుగోలు చేయాల్సి రావడం, విస్తరణ కోసం చేసిన ఆప్పు మీద అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం ప్రధాన కారణా లంటున్నారు. ఇవేమీ అథిగమించలేని ఆటంకాలు కావు. గనుల్ని కేటాయించడం ప్రభుత్వం చేతి లోని పని.(మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెయిల్‌ ‌కి చాలా గనులున్నాయట). ప్రస్తుతం విశాఖ కర్మాగారానికి రూ.22000 కోట్లు అప్పులు న్నాయట. లక్షల కోట్లు చేసే 20 వేల ఎకరాలకు పైగా భూములున్న కర్మాగారానికి ఇవేమీ తీర్చలేని అప్పులు కావు. ఈ అప్పులను కారణంగా చూపి కర్మాగారం నష్టాలలో ఉందని నింద వేసి దానిని అమ్మజూపడం అన్యాయం. 2019 లో ఆర్థిక మాంద్యంలో మననేదో ఉధ్ధరిస్తారని టాప్‌ ‌బ్రాకెట్‌ ‌లో ఉన్న కార్పొరేట్‌ ‌హౌజి కి లక్షానలబై ఐదు వేల కోట్ల టాక్స్ ‌రాయితీ ప్రకటించిన ప్రభుత్వానికి కేవలం 22 వేల కోట్ల రుణం మీద అధిక వడ్డీని తగ్గించడం చాలా చిన్న పని. ఇవేమీ చేయకుండా ఎందరి త్యాగ ఫలంగానో సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటు రాబందులకప్పగించ బూనడం ప్రజా శ్రేయస్సుని కోరి చేసే పని మాత్రం ఎన్నటికీ కాజాలదు.

లాభాలన్నవి వర్తకం చేస్తేనే వస్తాయి. ప్రభుత్వం పని వర్తకం చేయడం కాదన్నప్పుడు లాభాల గురించి ఎదురు చూడడం అసంబధ్దమే కదా? కొద్ది పాటి నష్టాలో లాభాలోఉన్నా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.. విశాఖ కర్మాగారంలో కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ మరికొన్ని వేల మంది పరోక్షంగానూ ఆధార పడి బ్రతుకుతున్నారు.కొత్త ఉద్యోగాలు ఎలాగూ కల్పించలేం. (2019 లో లక్షా నలభై వేల కోట్ల ఆదాయ పన్ను రాయితీ పొందిన బడా బాబులు ఏడాదిన్నర లోగా ఎన్నికొత్త సంస్థలు నెలకొల్పి ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో లెక్కలు తెలిస్తే మనం సంతోషించవచ్చు) దేశ అభ్యున్నతికి నిర్మాణరంగంలో నాణ్యమైన ఉక్కు అవసరం ఎంతో చెప్పాల్సిన పని లేదు.అందువల్ల లాభనష్టాల కాకుల్లెక్క చెప్పకుండా విశాఖ ఉక్కు కర్మాగారం నిరంతరాయంగా పని చేసేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఏ కర్మాగారం లోనైనా కార్మికుల పాత్ర ముఖ్యమైనది. కర్మాగారం నష్టాలకి తామే బాధ్యులమని కష్టపడి దానిని (తమ గోయి తామే తవ్వుకోకుండా) లాభాల బాట పట్టి నడిపించాల్సిన బాద్యత కార్మిక సంఘాలదీ, వారిని వెనుకనుండి నడిపించే శక్తులదీ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తే ఏ టాటాలవంటి ఆదర్శ సంస్థలో కొనుగోలు చేసి దానిని లాభాల బాటలో నడిపిస్తారనుకోవడం కంటే కొన్న కొద్ది రోజులకే నష్టాలు చూపించి బేంకు రుణాలకు ఎగనామం పెట్టడం ఫేక్టరీ మూసివేయడం ఆస్తులు అమ్మకానికి పెట్టడం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తస్మాత్‌ ‌జాగ్రత.
– గోపాలకృష్ణారావు పంతుల

Leave a Reply