Take a fresh look at your lifestyle.

‘ధక్ ..ధక్ ..! ఆగిన మాస్టర్జీ గుండె

కన్ను మూసిన కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ 

‘ఏక్ దో తీన్ చార్ పంచ్ చే సాత్ ‘.. పాట మనందరికీ తెలిసిందే. అందులో మాధురి దీక్షిత్ డాన్స్ .. సంజయ్ లీలా బన్సాలి దేవదాస్ ‘డోలారే డోలా..’ మాధురి దీక్షిత్.. ఐశ్వర్య రాయి తెరమీద డాన్స్ చూసి ఇంత సన్మోహన నృత్య హేల ఎవరో నేర్పారో….అని మనకి అనిపిస్తే…ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఆరా తీస్తే.. “నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 67 సంవత్సరాలు” అని తల నెమలిలా కదుపుతూ డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్.. మన ముందు నిలబడే వారు.. ఎవరైనా ఒక వ్యక్తి నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 67 సంవత్సరాలు అని చెబితే దాని అర్థం ఏంటి..? ఈ భూమి మీద బ్రతకాలి అంటే రూపాయి చేతిలో ఉండాలి.. రూపాయి చేతిలో లేకపోతే నీ ప్రాణానికి విలువ లేదు అన్న పరిస్థితి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఓ మహిళ 67 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని సొంతం చేసుకోగలుగుతారు..67 సంవత్సరాల వృత్తి అనుభవాన్ని సొంతం చేసుకున్న జీవిత ప్రయాణం చేసిన వ్యక్తి డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్.. ఆమె జీవన ప్రయాణం ఓ బ్రతుకు పోరాటంగా సాగి ఈరోజు ముగింపు దశకు చేరుకుంది..

సరోజ్ ఖాన్ తన నృత్య హేలను మూడు సంవత్సరాల వయసులో మొదలు పెట్టారు.. మూడేళ్ళ వయసులో పసిపాప సరోజ్ ఖాన్ తన చేతులతో గోడమీద నీడ పడే లాగా డాన్స్ చేస్తూ ఉంటే.. ఆమె బీద తల్లి తన కూతురు మంద బుద్ధి పిల్ల అనుకుని డాక్టర్ దగ్గరికి తీసుకు పోయారు. ఆ డాక్టర్ కి సినిమా ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆ డాక్టర్ మ్యూజిక్ ప్లే చేసి సరోజ్ ఖాన్ ని అబ్జర్వ్ చేశారు. మ్యూజిక్ కి తగ్గట్టు సరోజ్ ఖాన్ డాన్స్ చేయడం చూసి.. డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్ తల్లితో “మీ పేదరికం పోవాలి అంటే మీకు ఎంతో కొంత ఆదాయం రావాలి అంటే ఈ పిల్లను సినిమా ఇండస్ట్రీకి పంపించండి” అని చెప్పారు చైల్డ్ ఆర్టిస్ట్ వేషాలు కట్టే లాగా ఏర్పాటు చేస్తాను. నీకు సమ్మతమేనా. అని సరోజ్ ఖాన్ తల్లిని డాక్టర్ అడిగారు అందుకు సరోజ్ ఖాన్ తల్లి సరే అని ఒప్పుకొన్నారు. అలా సరోజ్ ఖాన్ చైల్డ్ ఆర్టిస్ట్ లేదా బాల కార్మికులుగా తన జీవితాన్ని మొదలు పెట్టారు. వయసు పెరుగుతూ తొమ్మిది పది సంవత్సరాలు వచ్చే సరికి చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ దొరకటం మానేశాయి. దానితో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా సరోజ్ ఖాన్ అవతరించారు. ఈ సమయం వరకు కూడా సరోజ్ ఖాన్ ఒక డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునే పరిస్థితిలో లేరు. ఈ సమయంలో మద్రాసు డాన్స్ మాస్టర్లు బాలీవుడ్ లో తమ హవా కొనసాగిస్తున్నారు.

సరోజ్ ఖాన్ పొట్టి జుట్టుతో రాక్ ఎన్ రోల్.. జై వింగ్.. ఆక్రోబేటిక్.. డాన్స్ చేసే వారు. భారతీయ నృత్యాన్ని సరోజ్ చేసే వారు. కాదు తనని తాను ఆంగ్లో-ఇండియన్ అని సరోజ్ ఖాన్ గొప్పగా చెప్పుకునేవారు. మద్రాస్ డాన్స్ మాస్టర్లకు వెస్ట్రన్ డాన్స్ నచ్చేది కాదు. అందుచేత వెస్ట్రన్ డాన్స్ చేసే అమ్మాయిలు దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఇలాంటి సమయంలో ఒక డాన్స్ మాస్టర్ దగ్గరకి పోయి నన్ను మీ గ్రూపులో చేర్చుకోండి అని సరోజ్ అడిగారు. ఆయన నిరాకరించారు. అతని అసిస్టెంట్ రేపు నువ్వు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకుని పొడుగు జడ వేసుకుని మాస్టర్ దగ్గరికిరా కచ్చితంగా నిన్ను తీసుకుంటారు అని చెప్పాడు.అసిస్టెంట్ చెప్పినట్లుగానే మరుసటి రోజు అసిస్టెంట్ చెప్పినట్టుగానే డాన్స్ మాస్టర్.. తన డాన్స్ ట్రూప్ లోకి సరోజ్ ఖాన్ ను తీసుకున్నారు..సరోజ్ ఖాన్ కు ఒక స్టెప్ చెప్పి వేయమంటే.. అద్భుతంగా ఆమె డాన్స్ చేసి చూపారు. బాగా డాన్స్ చేసావు ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావు అని డాన్స్ మాస్టర్ అడగగానే సరోజ్ ఖాన్ “ఇంతకాలం మీ ముక్కు కింద డాన్స్ చేస్తూనే ఉన్నా మీరే నన్ను పట్టించుకోలేదు” అని సమాధానమిచ్చారు. అక్కడి నుంచి ఆమె ఆ డాన్స్ మాస్టర్ గ్రూప్ లో సభ్యురాలిగా కొనసాగారు.

ఇలా డాన్స్ మాస్టర్ గ్రూప్ లో జాయిన్ అయిన రెండవ రోజే, సరోజ్ ఖాన్ తండ్రి మరణించారు. సరోజ్ ఖాన్ నాన్న అంత్యక్రియలకు వెళ్లకుండా, డాన్స్ చేస్తూ ఉండగా ఆమెతో పాటు ఉన్న డాన్స్ గ్రూప్ సభ్యులు కనీసం తండ్రి అంత్యక్రియలకు వెళ్ళని ఈమెతో మేము డాన్స్ చేయం అని మొరాయిస్తే.. అప్పుడు డాన్స్ మాస్టర్ మీ అందరూ మీ ఒక్క రోజు పేమెంట్ ఆమెకు ఇవ్వండి. ఆమె ఇంట్లో కూర్చుని ఏడు రోజులు ఏడుస్తుంది. అని మిగతా సభ్యులకు చెప్పారు. మీరెవరు డాన్స్ చేయకపోయినా పర్లేదు. ఆమె మాత్రం డాన్స్ చేస్తారు అని డాన్స్ మాస్టర్ ప్రకటించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత మూడు నెలల పాటు సరోజ్ ఖాన్ ఇంటికి పరిమితమయ్యారు. ఓ రోజు డాన్స్ మాస్టర్ హెలెన్ వెనుక డాన్స్ చేయటానికి రావాలి అని కబురు చేసారు. సరోజ్ ఖాన్ హెలెన్ వెనక డాన్స్ చేస్తూ తన స్టెప్పులు పక్కనపెట్టి.. హెలెన్ స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన డాన్స్ మాస్టర్ నువ్వు మొత్తం హెలెన్ డాన్స్ చేయగలవా..? అని అడిగారు సరోజ్ ఖాన్ స్టెప్స్ వేసి చూపారు. వెంటనే డాన్స్ మాస్టర్ హెలెన్ ని పిలిచి.. ఈ అమ్మాయి మీకు డాన్స్ నేర్పిస్తుంది.. మీరు ఈ అమ్మాయి నుంచి ట్రైనింగ్ పొంది డాన్స్ చేయాలి అని చెప్పారు. అలా 12 ఏళ్ల వయసులో సరోజ్ ఖాన్ డాన్స్ అసిస్టెంట్ అయ్యారు.

డాన్స్ అసిస్టెంట్ గా సరోజ్ ఖాన్.. హెలెన్, వైజయంతిమాల, ఆనాడు ఉన్న టాప్ హీరోయిన్లకు డాన్స్ నేర్పించారు. సరోజ్ ఖాన్ బాస్ అయిన డాన్స్ మాస్టర్ ఒక సినిమాకు డబ్బులు తీసుకుని వేరే సినిమా చేసేందుకు యూరప్ కు వెళ్ళినప్పుడు, డబ్బులు ఇచ్చిన నిర్మాత సరోజ్ ఖాన్ ను పట్టుకుని మీ బాస్ కి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వేరే డాన్స్ మాస్టర్ ని పిలిపించే అవకాశమే లేదు. నా సినిమాకు మీ బాస్ కి బదులు నువ్వు డాన్స్ కంపోజ్ చేయాలి అని ఆర్డర్ వేశారు. సరోజ్ బెంబేలు ఎత్తిపోతే ..అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఈ పాటలో ఒక లైను తీసి “నిఘా హే మిలానే కో జీ చాహతా హై” ఈ ఒక్క లైన్ కు డాన్స్ చేసి చూపు అన్నారు. సరోజ్ చేసి చూపారు. పో.. పోయి.. మిగతా అన్ని లైన్లకు ఇలానే డాన్స్ కంపోజ్ చేసుకుని రా.. అని చెప్పారు. అలా సరోజ్ ఖాన్ 14 ఏళ్ల వయసుకు డాన్స్ కంపోజర్‌గా అవతారమెత్తారు. ఇలా డాన్స్ అసిస్టెంట్‌గా..డాన్స్ కంపోజర్‌గా సరోజ్ ఐదేళ్లపాటు పనిచేస్తూ డాన్స్ నేర్చుకున్నారు. 14 ఏళ్ళకి సరోజ్ ఖాన్ ఓ బిడ్డ తల్లి. ఆమె తన డాన్స్ మాస్టర్ ని తన జీవన తోడుగా భావించి.. ఆయనతో పెళ్లి చేసుకున్నానని అని చెబుతారు. అయితే బిడ్డ పుట్టినాక ఆ బిడ్డకు నేనే తండ్రిని అని చెప్పడానికి డాన్స్ మాస్టర్ నిరాకరించడంతో.. ఆమె ఆ డాన్స్ మాస్టర్ తో విడిపోయి. మళ్లీ పరిశ్రమలో గ్రూప్ డాన్సర్ గా పనిచేయటం మొదలుపెట్టారు. మిగతా మాస్టర్ ల దగ్గర అసిస్టెంట్ గా పని చేయడానికి కూడా సరోజ్ ఖాన్ సిద్ధపడ్డారు. అలా తన బిడ్డను పోషించుకుంటూ కష్టపడుతున్న సరోజ్ ఖాన్ ను చూసి హీరోయిన్ సాధన తన సినిమా “గీతా మేరా నామ్” కు సరోజ్ ఖాన్ ను డాన్స్ కంపోజర్‌గా రికమండ్ చేశారు.

ఇలా కొరియో గ్రాఫర్ గా పని చేస్తున్న సరోజ్ ఖాన్ రాత్రి పగలు పని చేసినా.. కానీ ఆశించిన స్థాయిలో పాపులారిటీ రాలేదు. అందుకు కారణం సరోజ్ ఖాన్ సమయంలో బాలీవుడ్ లో మగ డాన్స్ మాస్టర్ ల హవా నడిచింది. ఇటువంటి సమయంలో హేమ మాలిని.. ధర్మేందర్ నటించిన పెద్ద సినిమా “ప్రతిజ్ఞ” అనే సినిమా లో సరోజ్ ఖాన్ కి అవకాశం దొరికింది దీనితో కొంత పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి కొత్త హీరోయిన్ మాధురి దీక్షిత్’ ఏక్ దో తీన్ చార్..’ పాటకి సరోజ్ ఖాన్ డాన్స్ కంపోజ్ చేశారు. ఆ పాట వలన ఆ సినిమా హిట్ అయ్యింది. అక్కడినుంచి సరోజ్ ఖాన్ ఆర్దిక కష్టాలకు ఒక చుక్క పెట్టినట్లు అయ్యింది. డాన్స్ మాస్టర్లకు ఫిలింఫేర్ అవార్డు ఇవ్వాలని ఫిలింఫేర్ భావించినా తర్వాత మొట్టమొదటి బెస్ట్ డాన్స్ కంపోజర్ అవార్డు సరోజ ఖాన్ పొందారు. అలాగే 1989 లో సరోజ్ ఖాన్ కు బెస్ట్ డాన్స్ కంపోజర్ నేషనల్ అవార్డు దొరికింది. ఆ తర్వాత ఆమెకు పలుమార్లు ఈ అవార్డు దొరికింది. “నా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ 67 సంవత్సరాలు” అని గర్వాంగా చెప్పే డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్ ఊతపదం ‘నెవెర్ గివ్ అప్.. నెవర్ గివ్ అప్ .. నెవర్ గివ్ అప్..’

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

Leave a Reply